టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తండ్రి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి నట వారసత్వంతో చిన్నతనంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ సినిమాతో సినిమా రంగంలోకి ప్రవేశించిన మహేష్ బాబు, ఆ తర్వాత బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. ఇక పెరిగి పెద్దయిన తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. ఇక అక్కడి నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అభిమానుల నుండి తండ్రి వలే సూపర్ స్టార్ అనే పేరు సంపాదించారు మహేష్. ఇకపోతే తండ్రి కృష్ణ గారి వలె, ఎప్పటికప్పుడు తన వంతుగా పలు సామజిక, సేవా కార్యక్రమాలు చేసే మహేష్ బాబు, 

ఇటీవల శ్రీమంతుడు సినిమా తర్వాత తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. అంతేకాక ఇటీవల ఏకంగా వెయ్యి మంది చిన్నారుల గుండె ఆపరేషన్లు చేయించి రీల్ పైనే కాక, రియల్ గా కూడా  సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఇక నేడు మరొక చిన్నారికి మహేష్ బాబు గుండె ఆపరేషన్ చేయించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన 13 నెలల సందీప్ అనే బాలుడు హార్ట్ లో మూడు హోల్స్ ఉన్నాయని తెలిసి కుమారుడికి ఆపరేషన్ చేయించే స్తోమత తమ దగ్గర లేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎంతో విలపిస్తుండగా, ఈ విషయం అక్కడి మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడుకి చేరటం, వెంటనే ఆయన ద్వారా విషయం మహేష్ బాబు దాకా వెళ్లడం జరిగిందట. 

ఇక బాలుడి ఆరోగ్య సమస్య విషయం తెలుసుకున్న మహేష్, విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ లో ఆ బాలుడికి శస్త్ర చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేయించారని, మరొక రెండు రోజుల్లో ఆ చిన్నారికి హార్ట్ ఆపరేషన్ జరగనుందని తెలుస్తుంది. తమ కుమారుడి సమస్య తెలిసి సూపర్ స్టార్ మహేష్ గారు గొప్ప మనసుతో ముందుకు వచ్చి ఆపరేషన్ చేయిస్తున్నందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అంటున్నారు బాలుడి తల్లిదండ్రులు. ఇప్పటికే ఎందరో చిన్నారులను కాపాడిన మహేష్, నేడు మరొక బాలుడు జీవితాన్ని తన దయార్థ హృదయంతో ఆదుకోవడంతో ఆయనపై ప్రేక్షకులు సహా, పలువురు సినిమా ప్రముఖులు సైతం విరివిగా ప్రశంసలు కురిపిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: