రోజురోజుకీ ఆర్టీసి ఉద్యోగుల సమ్మె ఉధృతం అవుతున్న నేపధ్యంలో ఈ సంస్థను నమ్ముకుని ఉన్న 48 వేలమంది కార్మీకులు ప్రస్తుతం రోడ్డు మీద పడటంతో వీరి భవిష్యత్ ఏమిటి అన్న ఆందోళన అన్ని వర్గాలలోను కనిపిస్తోంది. పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంత్ ఆచారి ఆత్మాహుతి చేసుకున్నట్లుగా ఇప్పుడు ఆర్టీసి కార్మికుల సమస్యల కోసం శ్రీనివాస రెడ్డి అనే ఆర్టీసి డ్రైవర్ అగ్నిజ్వాలలో తనకు తాను ఆహుతి అవ్వడం ఇప్పుడు అందర్నీ కలచివేస్తోంది.

ఈ ఉద్యమం రోజురోజుకు వేడెక్కిపోతున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను మరొక వారం రోజులు పొడిగించడంతో ఆ నిర్ణయం చిరంజీవి ‘సైరా’ కు కలిసి వచ్చిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్ధులకు సెలవులు కావడంతో పాటు చూడడానికి ఏ టాప్ హీరో సినిమా లేకపోవడంతో నిన్నటి రోజున ‘సైరా’ ధియేటర్లు అన్నీ ప్రేక్షకులతో కళకళలాడాయి. 

ఈ పరిస్థితి ఈ వారం అంతా కొనసాగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ‘సైరా’ 100 కోట్ల నెట్ షేర్ ను ఈ వీకెండ్ తో అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ఎవరు ఊహించని విధంగా ఉత్తరాంధ్రలో ‘సైరా’ బ్రేక్‌ ఈవెన్‌ అయి లాభాల్లోకి అడుగు పెట్టింది అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇక నైజాంలో కూడ నిన్నటితో  ‘సైరా’ 30 కోట్ల మార్కును చేరుకుంది అని వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ సినిమాల తర్వాత నైజాంలో ముప్పయ్‌ కోట్లు రాబట్టిన మరో సినిమా ఇప్పటి వరకు లేకపోవడంతో నైజాం ప్రాంతంలో ‘సైరా’ కలక్షన్స్ ఆ స్థాయికి చేరుకుని చిరంజీవి స్టామినాను సూచిస్తున్నాయి అని అంటున్నారు. అయితే ఈ మూవీ పరిస్థితి బాలీవుడ్ లో అదేవిధంగా తమిళనాడు కేరళ కర్ణాటకలలో రోజురోజుకు దిగజారి పోతుంటే తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ ఇప్పటికీ బలంగా కొనసాగుతున్న పరిస్థుతులలో జాతీయ స్థాయిలో ‘సైరా’ సంచలనాలు సృష్టించక పోయినా తెలుగు రాష్ట్రాలలో మటుకు ఈ మూవీ బయ్యర్లకు లాభాలను అందించే స్థాయికి దగ్గర పడుతోంది అని అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: