అల్లు అరవింద్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని ఆ నలుగురులో ఒకరిగా ప్రభావితం చేస్తున్న విషయం ఓపెన్ సీక్రెట్. అరవింద్ ఈమధ్య 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఆస్థులను అన్నింటిని తన ముగ్గురు కొడుకులతో పాటు తన అక్కచెల్లెళ్ళకు పంచిన విషయానికి సంబంధించిన ఆసక్తికర కథనాన్ని ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించింది. 

ప్రతి విషయంలోను చాలముందు చూపుతో వ్యవహరించే అరవింద్ ప్రస్తుతం అతడు నిర్మాతగా యాక్టివ్ గా కొనసాగుతున్న పరిస్థితులలోనే తన ఆస్తులను పంపకం చేసిన వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. తన గీత ఆర్ట్స్ వ్యాపారాలకు సంబంధించిన లాభాలలో ఎక్కువశాతం అరవింద్ సోదరి వసంతకు అదేవిధంగా అతడి పెద్ద కొడుకు బాబికి చిన్నకొడుకు అల్లు శిరీష్ కు వచ్చే విధంగా ఏర్పాటు చేసినట్లు ఆ కథనం బట్టి అర్ధం అవుతోంది.

ప్రస్తుతం బన్నీ తను సొంతంగా గీత ఆర్ట్స్- 2 బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఈమధ్యనే ఒక విలాసవంతమైన ఇంటికి శంఖుస్థాపన చేసుకున్న నేపధ్యంలో ఇప్పుడు ఇలా అరవింద్ ఆస్థుల పంపకాలు చేపట్టిన వార్తలు బయటకు రావడంతో అల్లు కుటుంబం విడిపోయిందా అన్న సందేహాలు ఎవరికైనా వస్తాయి. వాస్తవానికి శిరీష్ కు గీత ఆర్ట్స్ బాధ్యతలు అప్పచేప్పాలని అరవింద్ భావించినా అతడు ఇప్పటికీ హీరోగానే కొనసాగాలి అని భావిస్తున్న పరిస్థితులలో గీత ఆర్ట్స్ బాధ్యతలను అల్లు బాబికి అరవింద్ అప్పచెప్పాడు అని అంటారు. 

దీనికితోడు తనకు 70 సంవత్సరాలు రావడంతో తాను సినిమా నిర్మాణాలు డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన టెన్సన్స్ బాగా తగ్గించుకోవాలని భావిస్తున్న నేపధ్యంలో అరవింద్ ఇలా తన ఆస్థులు బాధ్యతలు ఇలా పంపకం చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఎదుగుదలకు ఎంతో సహకరించిన అరవింద్ చిరంజీవితో అనేక సూపర్ హిట్ సినిమాలు తీసి అరవింద్ నిర్మాతగా కూడ బాగా సక్సస్ అయ్యాడు అన్న విషయం అందరికి తెలిసిందే.. 



మరింత సమాచారం తెలుసుకోండి: