ఇళయ దళపతి విజయ్ నటించిన  లేటెస్ట్ మూవీ బిగిల్ విడుదలకు సిద్దమవుతుంది. మొన్న విడుదలైన  ఈ చిత్రం యొక్క ట్రైలర్ 20మిలియన్ల కు పైగా వ్యూస్ ను రాబట్టి  సౌత్ లో  కొత్త రికార్డులు క్రీయేట్ చేసింది.  ఇక బిగిల్  డిజిటల్ హక్కులను  అమెజాన్ ప్రైమ్ సొంతం  చేసుకుంది. ఈడీల్ విలువ 20కోట్లు అని సమాచారం. అలాగే శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడైయ్యాయని తెలుస్తుంది.  25కోట్లకు ఈడీల్ క్లోజ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం తమిళ్ తోపాటు తెలుగులో కలిపి 200కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని  టాక్. తద్వారా  విజయ్ కెరీర్ లో  అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా బిగిల్ రికార్డు సృష్టించింది. 




ఇక తెలుగు లో ఈచిత్రం  విజిల్  పేరుతో విడుదలకానుంది. మహేష్ ఎస్ కోనేరు ఈ థియేట్రికల్ హక్కులను  సొంతం చేసుకోగా  తెలుగు రాష్ట్రాల్లో  ఈ చిత్రం  10కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అయితే  తెలుగు వెర్షన్  నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి  క్లారిటీ రావాల్సి వుంది. అతి త్వరలో ఈచిత్రం యొక్క తెలుగు వెర్షన్  ట్రైలర్  కూడా విడుదలకానుంది. అట్లీ  డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  విజయ్  డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటించగా  ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రం దీపావళి కానుకగా  అక్టోబర్ 24 న లేదా  25 న కానీ విడుదలకానుంది.  ఇక  విజయ్ -అట్లీ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో తెరకెక్కిన  తెరి, మెర్సల్ సూపర్ హిట్లు అయ్యాయి. మరి ఈ బిగిల్ వీరికి  హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: