సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ ఎందరో హీరోలకి ఆదర్శంగా ఉంటారు. ఆయన డైలాగ్ చెప్తే స్టైల్... నడిస్తే స్టైల్.... ఫైటింగ్ చేస్తే స్టైల్... ఆయన ఏంచేసినా అది ఓ సపరేట్ స్టైల్. అందుకే ఆయన కంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. సూపర్ స్టార్ రజినీ సినిమా వస్తుందంటే పండగ చేసుకుంటారు అభిమానులు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకి అభిమానుల్లో క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గదు. 

 

 

 

 

 

 ఇక సూపర్ స్టార్  రజనీకాంత్ సినిమా వస్తుందంటే అన్ని  ఇండస్ట్రీ లా ప్రేక్షకులు   ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు . అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దర్బార్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఏదైనా సినిమా పూర్తయిన తర్వాత హిమాలయాల్లోకి వెళ్లి అక్కడ  సూపర్ స్టార్ రజినీకాంత్  ప్రత్యక్ష దైవంగా భావించే  బాబా దర్శనం చేసుకుంటారన్న   విషయం  తెలిసిందే. ఏ సినిమా చేసిన సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బాబా  గుహకు వెళ్లి దర్శనం చేసుకుని వస్తుంటారు. అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా... రజనీకాంత్ హిమాలయాలకు  వెళ్లిపోయారు. 

 

 

 

 

 షూటింగ్ పూర్తి కాగానే ఆయన ఉత్తరాఖండ్ కి  వెళ్లిపోయారు. చెన్నై నుంచి డెహ్రాడూన్ కి  విమానంలో బయల్దేరారు సూపర్ స్టార్ రజినీకాంత్. అక్కడి నుంచి కారులో పర్యటిస్తూ కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించుకొనున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక తాను ప్రత్యక్ష దైవంగా కొలిచే బాబా  గుహలో  ధ్యానం చేసి...  రజనీకాంత్ తిరిగి చెన్నై కి వస్తారని సమాచారం. ఆ తర్వాత ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: