చాలా మంది సినిమా హిరోలు సినిమాల్లోకి రాకముందు ఎంతో కష్టపడతారు. ఒక్క ఛాన్స్ కోసం వాళ్ళు పడే అవస్థలు ఎన్నో. తమని తాము నిరూపించుకోవడానికి, తెర మీద తమని తాము చూసుకోవాలని ఎన్నో కలలు కంటారు. కానీ కొందరికే అలాంటి అదృష్టం దక్కుతుంది. అయితే ఒక్కసారి వారికి అవకాశం వచ్చిన తర్వాత ఇక ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతారు. అలాంటి క్రమంలో వారికి ఏదైనా అడ్డంకి తగిలితే ఎలా ఉంటుంది?


ప్రస్తుతం హీరో నిఖిల్ పరిస్థితి అలాగే ఉంది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హ్యాపీడేస్ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి ఏమంత విజయం సాధించలేవు. ఆ తర్వాత స్వామిరారా సినిమాతో విజయాల పరంపర స్టార్ట్ అయింది. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలు వరుసగా విజయం సాధించాయి.


అయితే నిఖిల్ ప్రస్తుతం "అర్జున్ సురవరం" అనే సినిమా చేశాడు. కానీ ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా రిలీజ్ కి నోచుకోవట్లేదు. వేసవిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా చలికాలం వస్తున్న ఇంతవరకు రిలీజ్ కావట్లేదు. ప్రతిసారీ ఏదో ఒక కారణం చేత వాయిదా వేస్తూనే ఉన్నారు. అయితే ఈ వాయిదాలకి అసలు కారణం మాత్రం తెలియదు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లింది. ఈ సినిమా వస్తుందన్న ఆశలు కూడా వదులుకున్నారు.


అయితే తాజాగా ఈ సినిమా అక్టోబరులో వస్తుందన్నారు. కానీ ఈ నెలలో కూడా రిలీజ్ అవడం కష్టమే అంటున్నారు. నవంబరుకి వాయిదా పడేలా ఉందనే టాక్ వినిపిస్తుంది. అసలు ఇంతకీ ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది సందేహంగా ఉంది. అందరూ ఇండస్ట్రీకి రావడనికి కష్టాలు ఎదుర్కొంటుంటే నిఖిల్ మాత్రం ఇండస్ట్రీలో ఉండి కూడా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ చందు మొండేటి దర్శకత్వంలో" కార్తికేయ  2" సినిమాని చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: