టాలీవుడ్ లో పది సంవత్సరాల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మించిన ‘ఖైదీ నెంబర్ 150’ మూవీలో నటించారు.  ఈ మూవీ రైతు సమస్యలపై ఓ యువకుడు చేసిన పోరాటం..ఈ సెంటిమెంట్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘ఖైదీ నెంబర్ 150’ లో మరో పాత్రలో మాస్ లుక్ తో కనిపించిన చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ తో మాస్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.  మొత్తానికి ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ బాగుండటంతో సూపర్ హిట్ కావడమే కాదు..భారీగా కలెక్షన్లు కూడా రాబట్టింది. 

ఇది మెగాస్టార్ కి 150వ మూవీ.  ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అయ్యింది.  తాజాగా ఇప్పుడు మెగస్టార్ చిరంజీవి స్టార్ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో తన 152 వ మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీ ముహూర్తం కూడా ఈ మద్య అయ్యింది.  అయితే ఈ మూవీలో మెగస్టార్ పాత్ర విభిన్న కోణాల్లో ఉంటుందని, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యంగ్ చిరంజీవి పాత్రలో మెగా పవర్ స్టార్ కనిపిస్తాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి పాత్రలో నటించనున్న రామ్ చరణ్ ... ఈ వార్త నిజమైతే అది మెగా ఫ్యాన్స్ కు పండగే. 

గతంలో తండ్రీ కొడుకులు ‘మగధీర’ మూవీలో కనిపించారు.  'బ్రూస్ లీ' మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్స్ చేయగా ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీలో తండ్రి తో స్టెప్పులు వేశాడు రాంచరణ్.  ఈ తాజా మూవీలో చిరంజీవి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.  ఇదే గనక నిజమే అయితే మెగా ఫ్యాన్స్ కి సంబరాలే సంబరాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: