సంక్రాంతి కి తెలుగులో రెండు భారీ సినిమాలు విడుదల అవుతున్నాయని తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ నటించిన "సరిలేరు నీకెవ్వరు", స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "అల వైకుంఠపురములో " సినిమాలు సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదలకు సిధ్ధమవుతున్నాయి. అయితే ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా సంక్రాంతి రేసులోకి వస్తున్నాయి.


విక్టరీ వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్న "వెంకీ మామ" కూడా సంక్రాంతి కే రానుందట. దసరా కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అలస్యం వల్ల దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అది కూడా వీలు కాదని ఏకంగా సంక్రాంతి వరకు టైమ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు సమస్య ఇక్కడే వచ్చింది. ఆల్రెడి రెండు పెద్ద సినిమాలు కూడా సంక్రాంతికే విడుదలవుతున్న నేపథ్యంలో "వెంకీమామా" రేసులో నిలబడగలదా అనే సందేహం మొదలైంది.


ఎందుకంటే విక్టరీ వెంకటేష్ కి గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. ఎంత మల్టీ స్టారర్ అయినా సినిమా నిలవాలంటే ఎంతో వైవిధ్యం ఉంటే తప్ప నిలవలేదు. పోయిన సంక్రాంతి వెంకటేష్ ఎఫ్ 2 రూపంలో కలిసి వచ్చిందంటే దానికి కారణం దానితో పాటు వచ్చిన ఎన్టీఆర్, వినయ విధేయ రామ చిత్రాలు సరిగా ఆడకపోవడమే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనబడటం లేదు. మహేష్, బన్నీ చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి.


అదీ గాక వెంకీ మామ దర్శకుడు బాబీకి సరైన హిట్ లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అవగా, జై లవకుశ చిత్రం యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. ఇలాంటి సమయంలో ఆ రెండు సినిమాలకి పోటీ వెళ్ళడం సరికాదనే వాదన వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, పాయల్ రాజు పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: