యువ నటుడు కార్తీ కొద్ది రోజుల క్రితం నటించిన ఖాకీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తరువాత వచ్చిన చినబాబు మరియు దేవ్ సినిమాలు మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఖైదీ. తమిళ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.  డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తీ లారీ డ్రైవర్ గా ఒక పక్కా మాస్ పాత్రలో నటిస్తున్నారు. తొలి సారి పాటలు, అలానే హీరోయిన్ లేకుండా కార్తీ ఈ సినిమాలో నటిస్తున్నారు. 

ఇటీవల రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ టీజర్ తో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నేడు కాసేపటి క్రితం ఈ సినిమా అధికారిక థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ట్రైలర్ లో కార్తీ ఊర మాస్ ఫైట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టాడు అనే చెప్పాలి. కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ, కొన్ని అనుకోని ఘటనల వలన బయటకు వచ్చి, తన శిక్షకు కారకులైన వారిని ఏ విధంగా ఎదుర్కున్నాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తనకు బాగా నచ్చిన దర్శకుల్లో లోకేష్ ఒకరని, ఎందుకంటే వాస్తవికతకు దగ్గరగా, సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించడంలో లోకేష్ ఎప్పుడూ ముందు ఉంటారని, 

నిజానికి సినిమాని ఆ విధంగా చిత్రీకరిస్తేనే ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతుందని, ఇటీవల ఈ సినిమా తమిళ ట్రైలర్ రిలీజ్ సమయంలో హీరో కార్తీ మాట్లాడుతూ చెప్పారు. ఇక నేడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేసిన కార్తీ, ఈ సినిమా మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. సీఎస్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సత్యన్ సూర్య కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. కొద్దిరోజులుగా ఫ్లాప్స్ ని ఎదుర్కుంటున్న కార్తీ, ఈ సినిమాతో ఎంతవరకు విజయాన్ని అందుకుంటారో చూడాలి......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: