టాలీవుడ్ లో ప్రస్తుతం తమిళ హీరోల జోరు కొనసాగుతుంది. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి.  అయితే కొంత కాలంగా రజినీ,కమల్, విజయ్,అజిత్, సూర్య తర్వాత ఆయన సోదరుడు కార్తీ మూవీస్ కి ఇక్కడ మంచి ఆదరణ పెరిగిపోతుంది.  ఆ మద్య కార్తి నటించిన ఖాకీ సినిమా మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుస ఫ్లాపులు అవుతూ వచ్చాయి.  దాంతో  ఈ సారి ఆయన కథల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి అవకాశం ఇచ్చాడు.

ఈ దీపావళికి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది.  ‘మా నగరం’ సినిమాతో ప్రేక్షకలను అలరించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దోపిడీలు, డ్రగ్స్ రవాణా మరియు హత్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా  కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

రూ.840 కోట్ల రూపాయల ఖరీదు చేసే 900 కేజీల డ్రగ్స్ ను సీజ్ చేయడం, మాఫియా లీడర్ తన అనుచరులపై విరుచుకుపడటం, జైల్లో యావజ్జీవ శిక్షను అనుభవిస్తోన్న ఆదిశంకరం అనే ఖైదీగా కార్తీ పరిచయం.. జైలు నుంచి తప్పించుకున్న ఆయన కోసం పోలీసుల గాలింపు వంటి ఆసక్తికరమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఉత్కంఠను పెంచుతోంది.  "ఏందీ చస్తామని భయమేస్తుందా .. చావునైనా ఎదిరించి చావాలి సార్ .. ఇలా కాళ్ల మీదపడి కాదు" అంటూ కార్తీ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. మొత్తానికి ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే అంచనాలు పెంచుతుందని అంటున్నారు ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: