బిగ్ బాస్ ఫైనల్ కి ఇంకా కొన్ని రోజులే ఉంది. ఇలాంటి సమయంలో నామినేషన్స్ లో ఇచ్చే టాస్క్ సరిగ్గా ఆడటం చాలా ఇంపార్టెంట్.  ఈ సమయంలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు కూడా ఆసక్తిగా ఉంటాయి. ఈ వారం కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో ఓడిపోయి నామినేషన్స్ లో ఎవరెవరు ఉంటారో ఒకసారి చూద్దాం.


బిగ్ బాస్ ఫైనల్ కి ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. ఆదివారం మహేష్ ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయాడు. ఈ వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ టాపర్స్ ఆఫ్ ద హౌ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఎవరైతే మొదటి నాలుగు స్థానాలు దక్కించుకుంటారో వారు నామినేషన్స్ నుండి సేఫ్ అయినట్లు లెక్క. మిగిలిన వాళ్ళు నామినేషన్స్ లో ఉంటారు. అయితే మొదటి స్థానంలో బాబా భాస్కర్ నిలబడ్డాడు.


ఇక రెండవ స్థానంలో రాహుల్ ఉన్నాడు. అయితే రెండవ స్థానం కోసం శ్రీముఖి గట్టిగానే పోటీ పడుతుంది. ఏ టాస్క్ లోనైనా నువ్వు సూపర్ గా ఆడావా? రెండో స్థానంలో ఉండడానికి అని ప్రశ్నించింది. అదే ప్రశ్నని రాహుల్ శ్రిముఖిని కూడా అడిగేసరికి వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలుస్తుంది. మరి ఈ యుద్ధంలో శ్రీముఖి గెలవలేదని అర్థం అవుతుంది. దాంతో ఆమెకి చివరి స్థానం దొరికినట్లుగా తెలుస్తుంది.


ఇక వితికాకి మూడో స్థానం లభించింది. మూడో స్థానం కోసం శివజ్యోతి వరుణ్ తో వాదిస్తుంది. కావాలంటే వరుణ్ ఆ మూడో స్థానాన్ని తీసుకోవచ్చు. కానీ ఆయన తీసుకోలేదు. నాలుగో స్థానంలో ఆలీ ఉన్నాడు. ఐదవ స్థానంలో శివజ్యోతి, ఆరవ స్థానంలో వరుణ్, చివరి స్థానంలో శ్రీముఖి ఉన్నారు. మొత్తం ఏడుగురిలో ముగ్గురు నామినేషన్ లో ఉంటారు గనక శివజ్యోతి, వరుణ్, శ్రీముఖి లు నామినేషన్ లో ఉంటారు. మరి ఏం జరగనుందో చూడాలంటే ఈ రోజు రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: