సినీ స్టార్స్ సినిమాలలో కనిపిస్తేనే చూడటానికి బాగుంటుంది. వారి అభిమానించే ఫ్యాన్స్ కూడా ఎక్కువవుతారు. అలా కాకుండా ఈ మధ్య కాలంలో సినీ స్టార్స్ టెలివిజన్ కూడ దర్శనమిస్తూ అలరిస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే.. అలా ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా, ఏ ఛానెల్ లో చుసిన కూడా ఏడో ప్రోగ్రాం కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఆ షో లతో బాగా పాపులర్ అవుతున్నారు కూడా. ఏది ఎలా ఉండగా ఏ షో ద్వారా ఏ హీరో పాపులర్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం.. 


మీలో ఎవరు కోటీశ్వరుడు.. ఈ షో అన్ని పరిశ్రమల్లో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా హిందీ, తెలుగులో బాగా పాపులర్ అయింది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతిగా బిగ్ బి అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ షో ఎంత హిట్ అయిందో తెలిసిన విషయమే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఒకరిని చూసి మరొకరు షో లు చేస్తున్నారు. 


తెలుగులో కింగ్ నాగార్జున ఈ షో కి హోస్టుగా వ్యవహరించారు. మొదటి సీజన్లో నాగ్ రాగా, రెండో సీజన్లో చిరంజీవి హోస్టుగా వ్యవహరించారు. ఆ షో అటకెక్కడంతో ఇప్పుడు మరొక షో ప్రసారమవుతుంది ఆ షో నే బిగ్ బాస్.. ఈ షో తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో దర్శనమిస్తుంది. హిందీ, తమిళ్ లో చాలా సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులో మాత్రం రెండు సీజన్లు కానిచ్చి మూడో సీజన్ జరుపుకుంటుంది. 


ఇలా చెప్పుకుంటూ పొతే చాలా షో లలో సినీ ఇండస్ట్రీలో పెద్దవారుగా వ్యవహరిస్తున్న వారు బుల్లితెరపై కూడా సత్తాను చాటుతున్నారు. పాడుతా తియ్యగా కి ఎస్ పి బాలసుబ్రమణ్యం హోస్టుగాను, నె0 1 యారి షో కి దగ్గుపాటి రానా హోస్టుగా తానె ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నారు. ప్రతి ఇంట్లో చూసిన ఇదొక స్టార్ హోస్ట్ చేస్తున్న షో లు వినపడుతున్నాయి. రాను రాను సినిమాలను మించి షోస్ లలో సినీ తారలు వస్తారని అర్థమవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: