దక్షిణాదిలో గత దశాబ్దకాలంగా గ్లామర్ తారగా రాణిస్తున్న హన్సిక మోత్వాని, వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారు.అయితే మీరనుకున్నట్టు కాదు. తెరపైన జంటగా కనిపించబోతున్నారు. గత కొద్ది రోజులు మీడియాలో నానుతున్న వార్తపై క్లారిటీ వచ్చింది. వీరిద్దరు కలిసి తమిళంలో ఓ హారర్ చిత్రంలో నటించబోతున్నారు. ఇంతకు ఈ సినిమా గురించి అసలు విషయమేమిటంటే..

బెట్టింగ్ కూపంలో కూరుకుపోయి శ్రీశాంత్ క్రికెట్ రంగంలో నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే నిషేధం నుంచి బయటపడుతూ మళ్లీ పాత వైభవాన్ని చేజిక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా గత కొద్దికాలంగా శ్రీశాంత్ సినిమా రంగ ప్రవేశం గురించి వార్తలు వస్తున్నప్పటికీ కాంక్రీట్‌గా పెద్దగా డెవలప్‌మెంట్ జరుగలేదు. కానీ హిందీ సినిమాలో, అలాగే బిగ్‌బాస్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ప్రవేశించాడు.

మలయాళం, తమిళ, తెలుగులో సినిమా మొదలు కాబోతున్నట్టు వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీశాంత్ కల నిజమయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళ హారర్ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమువుతున్నది. కాగా శ్రీశాంత్‌తో కలిసి నటించేందుకు గ్లామర్ బ్యూటీ హన్సిక మోత్వానీ పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.

ఇక తమిళ చిత్రం ద్వారా శ్రీశాంత్ తన సినీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దర్శకులు హరిశంకర్, హరీష్ నారాయణ్ జంటగా దర్వకత్వం వహించబోతున్నారు. రంగనాథన్ అనే నిర్మాత ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా వివరాలను అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తారు.అయితే ఇది ఒక 3D హారర్ చిత్రం అని కూడా వార్తలు గుప్పు మంటున్నాయి చూద్దాం ఎలాంటి సినిమా తియ్యనున్నారో ఎంత పెద్ద హిట్ కొట్టనున్నారో వేచి చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: