‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి బాలీవుడ్ లో క్రేజ్ తీసుకురావడానికి రాజమౌళి వ్యూత్మకంగా ఈ మూవీలోని ఒక కీలక పాత్ర కోసం అజయ్ దేవగన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇతడి పాత్ర స్వరూపంతో పాటు ఇతడి గెటప్ కూడ ఫైనల్ అయిన నేపధ్యంలో చరణ్ జూనియర్ అజయ్ దేవగన్ పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసే ప్రక్రియకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

చరణ్ జూనియర్ లకు స్వాతంత్రోద్యమ స్పూర్తిని కలిగించే ఈ పాత్ర కీలకం అయినప్పటికీ ఈమూవీలో ఈ పాత్ర నిడివి కేవలం 30 నిముషాలు మించి ఉండదు అని అంటున్నారు. అయితే ఈ ప్రత్యేక పాత్రను చేయడానికి అజయ్ పెట్టిన కొన్ని కండిషన్స్ ను రాజమౌళి మరొక మాట చెప్పకుండా ఒప్పుకోవలసి వచ్చింది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

ఈ ప్రత్యేక పాత్రను చేసినందుకు 35 కోట్ల పారితోషికం అజయ్ రాజమౌళిని అడిగినట్లు టాక్. అయితే ఈ సినిమాలో హీరో పాత్రలను చేసిన చరణ్ జూనియర్ లకు చెరొక 30 కోట్లు పారితోషికంగా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో అజయ్ అడిగిన పారితోషికం ఎక్కువగా అనిపించినా ఈ మూవీ బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ బడ్జెట్ 400 కోట్ల వరకు ఉంటుంది అని రాజమౌళి ఓపెన్ గా లీకులు ఇస్తున్న నేపధ్యంలో కేవలం చరణ్ జూనియర్ అజయ్ దేవగన్  ల పారితోషికానికి సుమారు 100 కోట్ల వరకు ఈ మూవీ ప్రాజెక్ట్ నిమిత్తం ఖర్చు అవుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈ మూవీకి ఫిక్స్ చేయాలి అనుకున్న ‘రామ రౌద్ర రుషితం’ టైటిల్ కు కూడ పూర్తిగా పాజిటివ్ స్పందన రాకపోవడంతో మరో టైటిల్ గురించి రాజమౌళి దృష్టి పెట్టినట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: