రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  లేటెస్ట్ మూవీ  సాహో తెలుగు వెర్షన్  ఈనెల 19న  అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది.  సాహో ,తెలుగు , తమిళ, మలయాళ వెర్షన్ ల  డిజిటల్ హక్కుల కోసం ప్రైమ్ సుమారు 40కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించిందని సమాచారం. ఇక సాహో  హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులను మాత్రం నెట్ ఫ్లిక్స్   సొంతం చేసుకుంది. నవంబర్ లో ఈ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలకానుంది. 




ఇక  ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలై  నెగిటివ్ టాక్ తో తెలుగు , తమిళ , మలయాళంలో  డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.  అయితే  హిందీ లో  మాత్రం  ఈ చిత్రం 154కోట్ల షేర్ తో  సూపర్ హిట్   అనిపించుకొని ఈఏడాది అక్కడ 2.0తరువాత 100కోట్ల  క్లబ్ లో చేరిన డబ్బింగ్ చిత్రం గా  రికార్డు సృష్టించింది.  ఈచిత్రంతో ప్రభాస్ కు  హిందీ లో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత గా పెరిగింది. ఓవరాల్ గా సాహో ప్లాప్  టాక్ తోనే  అన్ని భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా  400కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించింది.  ఇదిలా ఉంటే  ఈ చిత్రం తెలుగులో మాత్రం  భారీ నష్టాలను మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో  125కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన  ఈచిత్రం  కేవలం 75కోట్లను మాత్రమే రాబట్టింది.  అలాగే ఓవర్సీస్ లో కూడా సాహో ఇదే  ఫలితాన్ని రిపీట్ చేసింది.  'రన్ రాజా రన్'  ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన  బాలీవుడ్  బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా  జాకీ ష్రాఫ్ , నిల్ నితిన్ ముఖేష్ ,మురళీ శర్మ , అరుణ్ విజయ్, మందిరాబేడీ   తదితరులు ముఖ్య పాత్రలు  పోషించారు.  భారీ బడ్జెట్ తో  యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: