టాలీవుడ్ లో ప్రస్తుతం హర్రర్, కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో నటుడు, దర్శకుడు లారెన్స్ తెరకెక్కించిన ముని,కాంచన,కాంచన 2,3 వరుస విజయాలు అందుకున్నాయి. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో ‘లక్ష్మీ బాంబ్’ గా తెరకెక్కిస్తున్నారు.  ఇదే కాన్సెప్ట్ తో తెలుగు బుల్లితెరపై తన సత్తా చాటిన యాంకర్ ఓంకార్ ‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా మారాడు.  మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..దాంతో  హర్రర్, కామెడీ నేపథ్యంలో ‘రాజుగారి గది’ సినిమా తీశాడు. 

ఈ మూవీలో కామెడీ, హర్రర్ తో పాటు ఆర్గాన్ డొనేషన్ పై సందేశం ఉండటం సినిమాకు బాగా కలిసి వచ్చింది.  ఆ తర్వాత నాగార్జున,సమంత ముఖ్య తారాగణంగా ‘రాజుగారి గది 2’ తీశాడు.  ఈ మూవీ కూడా మంచి కాన్సెప్ట్, సందేశమే అయినా..ఫ్లాప్ టాక్ వచ్చింది. దాంతో తన తదుపరి సినిమా మంచి హిట్ కావాలనే గట్టిపట్టుమీద ఉన్నారు ఓంకార్.  ఈ నేపథ్యంలో రాజుగారి గది3 తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 'నా గది లోకి రా' అంటూ సాగే ఈ పాట మాస్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

ఆ మధ్య కాలంలో 'రంగమ్మ మంగమ్మ' పాటతో ఆకట్టుకున్న మానసి ఈ పాట పాడింది. మరో కో సింగర్ రేవంత్ మంచి ఊపుతో పాడాడు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ఈ సాంగ్ లో ఐటమ్ గల్ల్స్ పిచ్చెక్కించే లెవెల్లో హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తున్నారు.  ఈ పాటలో హీరో తో పాటు ఆలీ, ధనరాజ్ కనిపించారు.  ఈ మద్య కాలంలో ఈ టైపు హాట్ ఐటమ్ సాంగ్స్ రావడం లేదు.. ఒక మంచి ఐటెం సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ టైములో ఓంకార్ విడుదల చేసిన లిరికల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: