రజనీకాంత్‌ మరోసారి హిమాలయాల బాట పట్టానున్నారు. రజనీ నటిస్తున్న చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకున్న అనంతరం, హిమాలయాలకు వెళ్లడం రజనీకాంత్‌కు ఆనవాయితీగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇలా ఎప్పుడు హిమాలయాల్లో కనీసం 10 రోజులకు తగ్గకుండా ఆయన గడిపి వస్తారు. తరువాత కొత్త చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా  ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దర్బార్’ సినిమాకు ఆయన  గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పూర్తి కాగానే ఆయన ఉత్తరాఖండ్ కు వెళ్లిపోయారు.


చెన్నై నుంచి ఆయన డెహ్రాడూన్ కు విమానంలో బయలుదేరి అక్కడి నుండి కారులో పర్యటిస్తూ కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలను రజనీకాంత్ సందర్శించనున్నారు. ఆపై తాను ప్రత్యక్ష దైవంగా భావించే బాబా గుహకు వెళ్లి  ధ్యాన ప్రక్రియ ముగించుకొని, ఆక్కడ పలు ప్రాంతాలను సందర్శించి.... ఇలా మొత్తం హిమాలయాలలోనే దాదాపు 10 రోజులు అయినా గడిపి... తిరిగి చెన్నై చేరుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తరువాతే ‘దర్బార్’ డబ్బింగ్ మరియు ప్రమోషనల్ కార్యక్రమాల్లో రజనీ పాల్గొంటారని సమాచారం.


ఇక ఆ తరువాత శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది. ఇక రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం మరింత జాప్యం అవుతుంది అని చెప్తున్నారు విశ్లేషకులు. మరో విషయం ఏమిటంటే.... రజనీకాంత్‌కు అత్యంత సన్నిహితుడు అయిన బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌  ఇటీవల  జరిగిన  ఒక  కార్యక్రమంలో రజనీకాంత్‌ను పేర్కొంటూ...  ఆయన్ని రాజకీయాల్లోకి రావద్దంటూ హితవు చేశారు. తాను తెలుగు నటుడు చిరంజీవికి కూడా  ఇదే సూచన చేశానని, ఇప్పుడు రజనీకి కూడా ఇదే చెబుతున్నానని పేర్కొన్నారు.

మరో పక్క బీజేపీ రజనీకాంత్‌ను తమ పార్టీలోకి ఎలా అయినా తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఏదేమైనా రజనీ రాజకీయ ప్రవేశం పెద్ద చర్చనీయాంశంగా మారిందన్న విషయం వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: