హ్యాపీ డేస్  సినిమాతో టాలీవుడ్ కి  ఎంట్రీ ఇచ్చి తెలంగాణ యాస డైలాగుల తో అదరకొట్టాడు హీరో నిఖిల్. ఆ తర్వాత వరుస సినిమాలు అవకాశాలు చేజిక్కించుకొని అంచెలంచెలుగా ఎదిగాడు నిఖిల్. హీరోగా మంచి క్రేజ్ సంపాదించిన నిఖిల్ ఎ ఎన్నో మంచి భిన్నమైన సినిమాలు  చేసి విజయాన్ని అందుకున్నాడు. ఏ సినిమాలో తనదైన నటనతో  ఎంతో  మంది అభిమానులను సంపాదించుకున్నాడు నిఖిల్ . అయితే తాజాగా ఎక్కడికి పోతావు చిన్నినాయన అనే హారర్ మూవీ లో నటించి.... మంచి విషయం అందుకున్నాడు ఈ యువ హీరో . ఆ తర్వాత కిరాక్ పార్టీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేక బాక్సాఫీసు ముందు బోల్తా పడింది. 

 

 

 

 

అయితే  సినిమాల్లోకి వచ్చి హీరో గా మారాలని ఎంతోమందికి కోరిక ఉంటుంది. ఆ కోరికను క్యాష్ చేసుకుని సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ డబ్బులు దండుకునే  కేటుగాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఇలాంటి ఘటన హీరో నిఖిల్ కూడా ఎదురైందట. తన హీరో అవ్వకముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే విషయాలని వెల్లడించాడు హీరో నిఖిల్. అయితే మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫీట్  అఫ్ విత్ ది  స్టార్స్ అనే రియాల్టీ షోలో పాల్గొన్నాడు నిఖిల్ . ఈ సందర్భంగా ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని ఆశక్తికర విషయాలను వెల్లడించారు. 

 

 

 

 

 మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫీట్ ఆఫ్ విత్  స్టార్స్ అనే రియాల్టీ షోలో పాల్గొన్న నిఖిల్ ... మంచు లక్ష్మి అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా క్రేజీ క్రేజీ ఆన్సర్ చెప్పాడు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో  నిఖిల్ కి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి కూడా తెలిపాడు. కొంతమంది కొన్ని సినిమాల్లో ఛాన్సులు  ఇస్తామని చెప్పి మోసం చేశారని నిఖిల్ చెప్పారు. ఒక్కో పాత్ర కోసం ఏకంగా ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేసేవారని చెప్పాడు నిఖిల్. అయితే తనకు డబ్బు లేకపోవడంతో తన నాన్న దగ్గర అడిగి డబ్బులు చెల్లించాడట .కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం కొంత మంది అవకాశాలు ఇప్పించలేదని తెలిపాడు.  తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి మరికొన్ని విశేషాలను పంచుకున్నారు యువ హీరో నిఖిల్ .

మరింత సమాచారం తెలుసుకోండి: