టాలీవుడ్ లో సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ యూత్ స్టార్ అని అందరికి  తెలిసిందే  . తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా తో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన  విజయ్ దేవరకొండ... మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి విజయం సాధించాడు. ఆ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి తో తీసిన అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్  ఓ రేంజ్ లో  పెరిగిపోయింది . ఇక విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత  వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో ఎన్నో సంచలన విజయాలను నమోదు చేశారు. కేవలం సినిమాలతోనే కాకుండా విజయ్ స్పీచ్, స్టైల్ తో కూడా అందరిని ఆకర్షిస్తాడు విజయ్

 

 

 

 

 తనదైన అట్టిట్యూడ్,  స్టైల్,  యాక్టింగ్ తో యూత్ ఐకాన్ గా  మారడు  విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ కెరియర్ లోనే ద సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి  దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ... టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. అర్జున్ రెడ్డి సినిమా తో విజయ్ దేవరకొండ యూత్ లో బాగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఈ ఒక్క సినిమా విజయ్ దేవరకొండ ని స్టార్ హీరో గా మార్చేసింది. అయితే ఈ సినిమాకి  దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి సేమ్ స్టోరీ లైన్ తో  హిందీలో  కబీర్ సింగ్ అనే పేరుతో సినిమా  తెరకెక్కించి అక్కడ సంచలన విజయం నమోదు చేశాడు. 

 

 

 

 

 

 అయితే తాజాగా కబీర్ సింగ్ తో మంచి విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి సినిమా నిర్మాతల తోనే మరో ప్రాజెక్టు చేయనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో  దర్శకుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ...ప్రస్తుతం తెరకెక్కిస్తున్న  ప్రాజెక్టు తర్వాత తన తర్వాత  సినిమా విజయ్ దేవరకొండ తోనే ఉన్నట్లు చెప్పాడు దర్శకుడు సందీప్ రెడ్డి. దీంతో వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే విజయ్ దేవరకొండ తో చేసిన మొదటి సినిమానే సెన్సేషనల్ హిట్ సాధించగా ... మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి క్రేజీ  సినిమా వచ్చి  బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుందో  అని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: