అక్కినేని కోడలు అగ్ర కథానాయిక సమంత 96 రీమేక్ లో నటిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్ కుమార్ తేరా మీదికి తీసుకొని రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికి  సమంతపై చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్బంగా సమంత ట్విటర్ ఖాతాలో తన  భావోద్వేగపు పోస్ట్ చేయడం జరిగింది.


96లో జాను రోల్ నాకు సవాల్ చేసింది.  నిన్న కంటే ఉత్తమంగా నన్ను జాను రోల్ మర్చేసింది. తొలిసారి నన్ను నేను కొత్తగా చూసుకుంటున్న ఫీలింగ్ కలుగుతుంది అని తెలిపింది సమంత. ఇప్పటి వరకూ చాలా పాత్రలు పోషించాను. మజిలీ లో చైతన్య భార్యగా నటించిన రోల్ ఒక ఎత్తు అయితే... 96లో జాను కూడా మరో ఎత్తు. జీవితంలో  మనకి కొన్ని పాత్రలు మనసుకు బలంగా తాకుతాయి. అందులో  ఇది ఒకటి అని అన్నది సమంత. అనునిత్యం మ్యాజిక్ క్రియేట్ చేసే చిత్ర బృందంతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అని తన భవనాలు తెలిపింది సమంత.


96 రీమేక్ బృందం నా డ్రీమ్ టీమ్. ప్రేమ్ కుమార్.. శర్వానంద్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్న అని ట్వీట్ చేసింది సమంత. ఈ సందర్భంగా తనలోని ఉద్వేగాన్ని దాచుకోలేకపోయింది. సమంత ఇటీవలే యూటర్న్ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి కూడా అందరి తెలిసిందే. యూటర్న్ భారీ విజయం సాధించకపోయినా.. సమంత పాత్రకు మంచి పేరు తెయ్చింది.

ప్రస్తుతం హిందీలో  ది ఫ్యామిలీ మ్యాన్ -2 అనే వెబ్ సిరీస్ లో పాత్ర పోషిస్తుంది. ఇది సామ్ కు తొలి వెబ్ సిరీస్. కలిసొస్తే వెబ్ సిరీస్ లలోనే సమంత సత్తా చాటే అవకాశం కూడా ఉంది. అలాగే సొంతంగా వెబ్ సిరీస్ ల నిర్మాణం.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల నిర్మాణం అంటూ చాల పెద్ద ప్లన్స్ లోనేనా ఉంది సమంత అని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: