సాధారణంగా దర్శకులు సినిమాల్లోని హీరోల హీరోయిజాన్ని ఎలివేట్ చేయటం కోసం లాజిక్ వదిలేసి కొన్ని సన్నివేశాలు సృష్టిస్తారు. అలాంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తే ఎటువంటి సమస్య లేదు కానీ అలాంటి సన్నివేశాలు అలరించకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ ఫలితాన్ని అందుకోవాల్సి ఉంటుంది. బాలకృష్ణ బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలోని కొన్ని సీన్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక విమర్శలపాలయ్యాయి. 
 
ఈ సినిమాలో తొడగొడితే రైలు వెనక్కి వెళ్లిపోవటం, తొడగొట్టిన వెంటనే జయప్రకాష్ రెడ్డి కుర్చీ ముందుకు రావడంలాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఈ సీన్లు బాలకృష్ణ అభిమానులకు కూడా నచ్చకపోవటంతో సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఒక సందర్భంలో పలనాటి బ్రహ్మనాయుడు సినిమా విశేషాల గురించి చెప్పుకొచ్చారు. 
 
విజయేంద్ర ప్రసాద్ మొదట సింహాద్రి సినిమా కథ బాలకృష్ణ కోసం రాశాడని బి.గోపాల్ అదే సమయంలో సింహాద్రి కథ వద్దని బాలకృష్ణ కన్నడలో విష్ణువర్ధన్ నటించిన కథలో నటించటానికి ఒప్పుకున్నాడని పరుచూరి గోపాలకృష్ణకు చెప్పాడట. రైలు సన్నివేశాన్ని ఒక రైలు మరో రైలును ఢీ కొట్టే సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తుంటే సీనియర్ ఎన్టీయార్ పలనాటి బ్రహ్మనాయుడిలా కనిపించే విధంగా తీద్దామని పరుచూరి గోపాలకృష్ణ బి.గోపాల్ కు చెప్పాడట.  రైలు సన్నివేశం తీసే సమయంలో ఆ సన్నివేశం అలా వద్దని పరుచూరి గోపాలకృష్ణ చెబితే బి.గోపాల్ సినిమాలో ఈ సన్నివేశం ఉండదని సమాధానం చెప్పాడట. 
 
కానీ పలనాటి బ్రహ్మనాయుడు సినిమా కథ చెప్పిన సమయంలో ఆ సన్నివేశం అందరికీ నచ్చిందని ఆ కారణం వలన సినిమాలో ఆ సన్నివేశం అలాగే ఉంచేశామని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. తొడగొడితే రైలు వెనక్కు వెళ్లిపోవటం, తొడగొడితే కుర్చీ ముందుకు రావటంలాంటి సన్నివేశాలు సినిమాలో లేకపోతే మాత్రం పలనాటి బ్రహ్మనాయుడు సినిమా అంత దారుణమైన ఫలితాన్ని అందుకొని ఉండేది కాదని చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: