సాధారణంగా ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపే.. అవి అందుకున్నవారు వెంటనే రిప్లై ఇస్తుంటారు. ఒకవేళ పొరపాటున చూసుకోలేకపోతే ఒకటి రెండు రోజుల్లో స్పందిస్తారు. కానీ, ఒక విషెస్ ట్వీట్‌కు నెల, అంతకన్నా ఎక్కువ రోజుల తర్వాతే స్పందిస్తే ఎలా ఉంటుంది. ముందు, ఆ ట్వీట్ చూసినవాళ్లకు కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆ తరవాత ఇప్పుడు రిప్లై ఏంటిరా బాబూ తలపీక్కుంటాం. ప్రస్తుతం ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు చేసిన ట్వీట్ చూస్తే ఇలానే అనిపిస్తుంది.


పీవీ సింధు బీడబ్ల్యూ‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌‌గా అవతరించిన సంగతి తెలిసిందే. స్విట్జర్లాండ్ వేదికగా ఆగస్టు 25న జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో జపాన్ షట్లర్ ఒకుహరాపై విజయం సాధించి సింధు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అంతేకాదు, ఈ టోర్నీలో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా అరుదైన ఘనత సాధించింది. దీంతో పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి సాధారణ ప్రజల వరకు అంతా పీవీ సింధుని ప్రశంసించారు.


దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా పీవీ సింధుని అభినందిస్తూ ఆగస్టు 25న ట్వీట్ చేశారు. అయితే, 48 రోజుల తరవాత ఈ ఆదివారం రాజమౌళి ట్వీట్‌కు పీవీ సింధు రిప్లై ఇచ్చారు. థాంక్యూ చెబుతున్నట్లుగా రెండు చేతులు జోడించిన ఎమోజీలతో రాజమౌళి ట్వీట్‌కు సింధు రిప్లై ఇచ్చారు. అయితే, ఇంత ఆలస్యంగా సింధు రిప్లై ఇవ్వడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అయితే, చాలా త్వరగా రిప్లై ఇచ్చారు అంటూ వెటకారం చేస్తున్నారు.


వాస్తవానికి రాజమౌళి ట్వీట్ చేసిన సమయానికి పీవీ సింధు చాలా బిజీగా ఉంది. ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనందంలో ఉంది. బహుశా ఈ కారణం చేతే రాజమౌళి ట్వీట్ చూసుండకపోవచ్చు. కానీ, ఇంత ఆలస్యంగా చూసిన తరవాత రిప్లై ఇవ్వకుండా ఉంటే సరిపోయేది. అయితే, రాజమౌళి లాంటి దేశం గర్వించదగిన దర్శకుడు ట్వీట్ చేస్తే రిప్లై ఇవ్వాలి కదా అని సింధు భావించి ఉండొచ్చు. అందుకే, ఆలస్యమైనా తన బాధ్యతగా రాజమౌళికి సింధు థ్యాంక్స్ చెప్పింది.




మరింత సమాచారం తెలుసుకోండి: