రిలీజ్ అయిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతాయని అందరికీ తెలుసు. అయితే ప్రతి ఏడాదిలో టాలీవుడ్ కు కొన్ని భారీ హిట్స్ ఉంటాయి. ఈ ఏడాది మాత్రం అలాంటి హిట్ ఒక్కటంటే ఒక్కటి లేదు ఎఫ్-2  తప్ప.    అయితే ఆ సినిమా అందరికీ లాభాలు తీసుకొచ్చింది కానీ కలెక్షన్స్ రేంజ్ ప్రకారం చూస్తే భారీ హిట్ అయితే కాదు.  ఇక 'సాహో'.. 'సైరా' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.  'సాహో'  కలెక్షన్స్ భారీగానే వచ్చాయి కానీ సరైన హిట్ అని చెప్పలేము. ఇక 'సైరా' పరిస్థితి కూడా సుమారుగా అంతే.  

ఈ ఏడాది ద్వితీయార్ధంలో రెండు తెలుగు భారీ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అయ్యాయి.  అందులో ఒకటి ప్రభాస్ సాహో కాగా, రెండో సినిమా మెగాస్టార్ సైరా. ప్రభాస్ సాహో సినిమా ఆగష్టు 30 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది  ఫస్ట్ ఇండియన్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమా అంచనాలకు అందుకోలేకపోయింది. అయితే, బాలీవుడ్లో చేసిన ప్రమోషన్లు, టివి-షో ప్రమోషన్స్ కారణంగా సినిమాకు కలిసి వచ్చింది. బాలీవుడ్ లో సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి.  

అయితే టాలీవుడ్ లో ఈ రకమై ప్రమోషన్స్ కు దూరంగా ఉండటంతో సినిమా ఇక్కడ అనుకున్నంత హీట్ రాక హిట్ కాలేదు.  అక్కగా, మెగాస్టార్ నటించిన సైరా అక్టోబర్ 2 న రిలీజ్ అయ్యింది.  ఈ మూవీని తెలుగులో గ్రాండ్ గా ప్రమోషన్స్ చేశారు.  బాలీవుడ్లో పెద్దగా పట్టించు కోలేదు.  ఫలితంగా బాలీవుడ్లో కలెక్షన్లు పడిపోగా, తెలుగులో మాత్రం సినిమా ప్రమోషన్స్ కారణంగా మంచి వసూళ్లు సాధిస్తూ వచ్చింది. సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రమోషన్స్ చేయడం సినిమాకు కలిసి వచ్చింది.  
Image result for saaho - say raa mejasic picture
సైరా నరసింహారెడ్డి విడుదలై అప్పుడే 12రోజులు గడిచిపోయిందితెలుగులో సత్తా చూపిస్తుంది. ఇక్కడ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 12 రోజు ల్లో సైరా కేవలం తెలుగు వర్షన్ ల్లో మాత్రమే ₹100 కోట్ల షేర్ అందుకుంది. దసరా సెలవులను బాగా ఉపయోగించుకొని రచ్చ చేసాడు సైరాలో చిరంజీవి. తొలినుంచే తెలుగు రాష్ట్రాల్లో సైరా ప్రభంజనం కనిపించింది. నైజాంలో ₹ 31 కోట్ల షేర్ అందుకుని, లాభాల్లోకి వచ్చేసింది. ఆంధ్రాలో కూడా ₹ 72 కోట్ల మైలురాయి అందుకుంది సైరా.

వారాంతంతో పాటు దసరా సెలవలను సైరా వాదేసుకున్న సైరా -  తెలంగాణలో మరో వారం సెలవులు రావడంతో సైరాకు మరింత కాలం కలిసి రానుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా 'మెగాస్టార్ ప్రభంజనం' కనిపిస్తుంది. ఓవర్సీస్‌ లో కూడా $ 2.50 మిలియన్ మార్క్ అధిగమించింది. హిందీలో మాత్రం సైరా ఊహించిన వసూళ్లు సాధించ లేదు. ఈ చిత్రం అక్కడ ₹ 10 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు ₹ 99.93 కోట్ల షేర్ వసూలు చేసిన సైరా, ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ₹135 కోట్ల షేర్ వసూలు చేసి ఒక ప్రాంతీయ సినిమాగా మిగిలిపోయింది. పాన్ ఇండియా సినిమా మాత్రం కాదని ఋజువు చేసుకుంది. ‘సైరా’ 6 డేస్ కలెక్షన్స్ తో వరసగా రెండోసారి ₹ 100 కోట్ల క్లబ్‌ లో చిరంజీవి చేరిపోయారు. 

బాహుబలి 2 తర్వాత ఆ స్థాయిలో పర్ఫార్మ్ చేసిన తెలుగు సినిమా ఇదే. ఇక తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో సైరా వసూళ్ళు రాలేదు. కానీ కన్నడ నాట మాత్రం దుమ్ము దులి పేస్తుంది ఈ చిత్రం. మొత్తానికి సైరా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ₹ 135 కోట్ల షేర్ అందుకుంది, గ్రాస్ ₹ 210 కోట్లకు పైగానే ఉంది. ఖైదీ నెం 150 తర్వాత వరసగా రెండోసారి కూడా 100 కోట్ల షేర్ అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు మెగాస్టార్. ₹ 170 కోట్లు దాటితే తప్ప సైరా సేఫ్ జోన్ లోకి రాదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగులో మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు        ₹135 కోట్లు షేర్ వసూలు చేసింది. నైజాంతో పాటు ఉత్తరాంధ్ర, నెల్లూరులో మాత్రమే సేఫ్ జోన్ లో చేరి పోయియింది ఈ చిత్రం. మిగిలిన చోట్ల 'బ్రేక్ ఈవెన్' కావాల్సి ఉంది. మొత్తానికి సైరాతో చిరు ప్రయాణం పాన్ ఇండియా స్థాయి నటుడు అని అనిపించుకోలేక పోయింది.

Image result for saaho - say raa mejasic picture


మరింత సమాచారం తెలుసుకోండి: