సినిమా నటులు, సాంకేతిక నిపుణులు అందరూ కేవలం సినిమాల పైనే ఆధారపడే రోజులు పోయాయి. ఒకప్పుడు నటనతో వచ్చే సంపాదనను చాలా మంది పెంచుకోలేకపోయారు. కానీ కొంతమంది తమ సంపాదనను పెట్టుబడులు పెట్టి నేడు సంతోషంగా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నేడు చాలామంది సినిమాలతో పాటు వ్యాపారాలూ చేస్తున్నారు. ఈ జాబితాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా చేరుతున్నారు.

 

 

 

త్రివిక్రమ్ తెలుగులో స్టార్ రైటర్ గా ఎదిగాడు. దర్శకుడిగా మారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పలు సినిమాలు తీసి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. అగ్ర దర్శకుల్లో ఒకడిగా చెలామణీ అవుతున్న త్రివిక్రమ్ ఒక కొత్త బిజినెస్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అదికూడా తనకు తెలిసిన సినిమా బిజినెస్సేనని అంటున్నారు. ఇందుకు రాజమండ్రిలోని ఓ సినిమా కాంప్లెక్స్ ను తీసుకుంటున్నాడని త్వరలోనే రీమోడలింగ్ పనులు మొదలుపెట్టనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈతరహా బిజినెస్ లో మహేశ్, వినాయక్ తదితరులు ఎంటర్ అయ్యారు. అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ లోని సత్యం థియేటర్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. వీరంతా తమకు తెలిసిన బిజినెస్ లొనే పెట్టుబడులు పెట్టి సినిమాలతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూసుకుంటున్నారు.

 

 

వీరందరికీ మార్గదర్శకుడిగా నాటి తరం నటుడు శోభన్ బాబును చెప్పుకోవచ్చు. సీనియర్ నటుడు మురళీమోహన్ కూడా ఇదే విషయం చెప్తూంటారు. శోభన్ బాబు వల్లే తాను రియల్ ఎస్టేట్ రంగంలో రాణించానని కూడా చెప్తూంటారు. చంద్రమోహన్ కూడా శోభన్ మాటలనే పాటించానని చెప్తారు. నేటి రోజుల్లో వ్యాపారాలు మరీ ముఖ్యం. ఇది గమనించే పలువురు నటులు పలు వ్యాపారాల్లోకి ఎంటర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: