ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా  'బిగిల్'  ట్రైలర్ విడుదల అయింది. ఎప్పటి లాగానే తమిళనాట బిగిల్ ట్రైలర్ పై భారీ ఆసక్తి వ్యక్తం అవుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా విజయ్ ఫ్యాన్స్ హంగామాగు హద్దులు లేదు. నిజానికి విజయ్  ఫ్యాన్సుకు మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకులకు కూడా వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది ట్రైలర్.  ఈ ట్రైలర్ పై సెలబ్రిటీలు కూడా స్పందిస్తుండడం  చాలా విశేషం.


ఇక 'బిగిల్' ట్రైలర్ పై బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూడా తెలియచేసారు. 'బిగిల్'  ట్రైలర్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన షారూఖ్ " నా స్నేహితులు విజయ్.. ఎఆర్ రెహమాన్.. అట్లీలకు అల్ ది బెస్ట్.  చక్ దే స్టెరాయిడ్స్ లో ఉన్నట్టుంది" అంటూ ట్వీట్ చేయడం జరిగింది.  గతంలో హాకీ నేపథ్యంలో 'చక్ దే ఇండియా' అనే స్పోర్ట్స్ డ్రామాలో షారూఖ్ నటించడం జరిగింది.  


ఆ సినిమాలో మహిళల హాకీ టీమ్ కోచ్ పాత్రలో షారూఖ్ నటన ప్రేక్షకులనే కాకుండా విమర్శకులను కూడా దరి చేరింది.  ఆ సినిమాకు స్టెరాయిడ్స్ జోడించినట్టుగా ఉందని వ్యాఖ్యానించడం 'బిగిల్' సినిమా ట్రైలర్ కు ఒక కాంప్లిమెంట్ కిందే లెక్క అయంది. ఈ సినిమా ట్రైలర్ పై షారూఖ్ ఏదో క్యాజువల్ గా స్పందించలేదని.. డైరెక్టర్ అట్లీ తో షారూఖ్ త్వరలో ఒక సినిమా చేయబోతున్నారని కోలీవుడ్ లో మంచి టాక్ వినిపిస్తోంది.  


అది నిజమో కాదో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది తెలుస్తుంది. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అందరికి తెలిసిందే. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. అట్లేవిజయ్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: