ఇటీవల చిరు సైరా సినిమా విడుదల అయంది అందరికి తెలిసిందే కదా. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'సైరా' రిలీజై ఇప్పటికి పది రోజులు అయంది.  సినిమాకు మంచి రివ్యూస్.. టాక్ వచ్చినా యూఎస్ కలెక్షన్స్ ఆశించినంత లేకపోవడం మొదట్లో ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది అని ఇండస్ట్రీలో తెలుస్తుంది.  అయితే 'సైరా' రెండో వారంలో కూడా పెద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉండడం శుభపరిణామమే. మొత్తానికి అన్ని వివాదాల మధ్యలో కూడా బాగా మంచి కలెక్షన్స్ వాసులు చేసింది అనే చెప్పాలి.


గత వరం కలెక్షన్లతో 'సైరా' టోటల్ గ్రాస్ $2.44 మిలియన్ కు చేరింది. దీంతో అమెరికాలో ఆల్ టైం హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ -10 సినిమాల లిస్టులో పదవ స్థానంలో ఉంది ఈ సినిమా. నిజానికి ఫస్ట్ వారం తర్వాత కలెక్షన్స్ తగ్గడంతో 'సైరా కలెక్షన్స్ $2.5 మిలియన్ మార్కుకు దగ్గరగా వస్తాయని ఎవరూ ఊహించలేదు. అయితే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరేందుకు మాత్రం ఇంకా చాలా దూరం గడపాల్సిన సమయం ఉంది.


 మరో విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం 'ఖైది నెం.150' లైఫ్ టైం కలెక్షన్స్ $2447043 కాగా 'సైరా' ఇప్పుడు ఆ కలెక్షన్స్ ను దాటేసింది అంటే నామంది.  ఇప్పుడు సైరా కలెక్షన్స్  $2448312.  ఇది ఒక అల్ టైం రికార్డు లాగా నిలిచింది.


ఇక అమెరికాలో టాప్-10 కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఫిగర్స్ అన్నీ మిలియన్స్ లో. బాహుబలి 2: $20.57 , బాహుబలి: $6.86 , రంగస్థలం: $3.51 , భరత్ అనే నేను: $3.41  , సాహో: $3.23 , శ్రీమంతుడు: $2.88 , మహానటి: $2.54 , గీతగోవిందం: $2.46 , అ ఆ: $2.44 , సైరా: $2.44 . అన్ని సినిమాలు సాధించిన కలెక్షన్స్  వివరాలు పూర్తిగా చుస్తే సైరాకి పదవ స్థానంలో ఉంది అని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: