టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'అల వైకుంఠపురములో' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. తొలిసారి బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎంటర్టైన్మెంట్ ని కలగలిపి చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలోని సామజవరగమనా అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్, ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఆ సాంగ్ రిలీజ్ తరువాత టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి అనే చెప్పాలి. 

ఇకపోతే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అదేమిటంటే, ఈ సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్న బ్లూ స్కై సినిమాస్ వారు, 'మీరు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో మా సినిమాను చూడలేరు' అంటూ నేడు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే అది చదివిన నెటిజన్లు కొంత ఆలోచనలో పడి, పూర్తిగా దాని పై ఆరా తీయగా అసలు విషయం అర్ధం అయింది. అదేమిటంటే, ఇప్పటివరకు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలను ఒక నెల తరువాత నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ప్లాట్ ఫాన్స్ లో ప్రేక్షకులు వీక్షిస్తుండగా, 

తమ 'అల వైకుంఠపురములో' సినిమా విషయమై పూర్తిగా సినిమాని థియేటర్స్ నుండి తీసేసి, ఓవర్ అల్ గా క్లోజింగ్ అయ్యేవరకు దానిని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేయడం జరుగదని ఆ ప్రకటన యొక్క అర్ధం అని తెలిసింది. అయితే ఈ విధంగా చేయడం వలన పలు ప్రాంతాల్లోని ప్రేక్షకులు, ముఖ్యంగా ఓవర్సీస్ లోని ప్రేక్షకులు తప్పకుండా సినిమాను థియేటర్స్ లో వీక్షించే అవకాశం కొంతవరకు అయినా ఉంటుందని భావించి, ఈ విధంగా ప్రకటించారట. మరి ఈ ఫార్ములా అల వైకుంఠపురములో సినిమా విషయంలో ఎంతవరకు పని చేస్తుందో చూడాలి....!!     


మరింత సమాచారం తెలుసుకోండి: