ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. 'ఎయిర్ టెల్' మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత రాజ్ కందుకూరి, యంగ్ సెన్సేషనల్ హీరో అడివి శేష్ అతిథులుగా హాజరయ్యారు. ఆపరేషన్ గోల్డె ఫిష్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా  మార్కెట్ మార్కెట్ లో విడుదల అయింది.


డా. రాజశేఖర్ మాట్లాడుతూ "టైటిల్ బాగుంది. యూత్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ సినిమాను నిర్మించి, విడుదల చేస్తున్నప్పుడు... యూత్ ఎట్రాక్ట్ అవుతారు. మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. నేను ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా. పోలీస్ క్యారెక్టర్లు చేసే హీరోలందరూ ఈ వేదికపై ఉన్నారు. ఇటీవల అడవి శేష్ పోలీస్ క్యారెక్టర్ చేశారు. నేను చాలా పోలీస్ క్యారెక్టర్లు చేశా. సాయికుమార్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు‌. అబ్బూరి రవి గారి గురించి జీవిత, అడవి శేష్ నాకు చెబుతూ ఉంటారు. ఆయన ఫేమస్ రైటర్. చేయి పెడితే గోల్డే. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా‌. అబ్బూరి రవి గారు నటించడం కస్టమన్నారు. కాదు... రాయడమే కష్టం. రైటర్స్ కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని నేను అనుకునేవాడిని. అయితే... 'ఎవడైతే నాకేంటి' ‌ కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసినప్పుడు రైటర్ కష్టం తెలిసింది. అప్పుడు రైటర్స్ కి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదని అనుకున్నా. సాయి కుమార్ గారు మైసూర్ లో ఉండడం వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన తరఫున నేను వచ్చాను. ఆది వండర్ ఫుల్ ఆర్టిస్ట్. చాలా కష్టపడతాడు. ‌ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు. యంగ్ హీరోలందరూ కలిసి డబ్బులు పెట్టి ఒక సినిమా చేశారు. నేను అటువంటి మనస్తత్వం ఉన్న హీరోనే. ఇప్పటికీ చెబుతూ ఉంటా... నాకు కథ నచ్చితే రెమ్యూనరేషన్ ఇవ్వొద్దు అని. కొత్త దర్శకులు, నిర్మాతలకు డబ్బులు వస్తే ఇవ్వమని చెప్తా. నమ్మకం ఉంటేనే సినిమా చేస్తాను కదా! నమ్మకం ఉంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే తీసుకోవాలి అనే మనస్తత్వం నాది. అందరూ ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది" అన్నారు. ‌


మరింత సమాచారం తెలుసుకోండి: