నవ్వడం ఒక భోగం...నవ్వించడం ఒక యోగం... నవ్వలేకపోవడం ఒక రోగం... అని హాస్య బ్రహ్మ జంధ్యాల ఆనాడు  చెప్పడం అక్షరాలా నిజం. అవును నవ్వలేకపోవడం నిజంగా ఒక రోగమే ..! ఒకసారి మనసారా నవ్వి చూస్తే మనకే తెలుస్తుంది...!  నవ్వించడం  అనుకునేంత సులువు కాదు సుమా ....! మన టాలీవుడ్ లో మనలను నవ్వించే హాస్యకారులు (బ్రహ్మానందం, అలీ, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్‌ నారాయణగార్లు) ఇలా  చాలా మంది ఉన్నారు. 

అందులో 'అలీ' స్థానం ప్రత్యేకమైంది. ఈయన  ఎప్పుడు  ‘దర్శకుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో నటుడిగా దాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. వీరు ఎప్పుడు  దర్శకుణ్ణి ఇబ్బంది పెట్టలేదు. ‘రాజుగారి గది 3’ చిత్రం గురించి  మాట్లాడుతూ అలీ ఇలా అన్నారు. ‘వీడు బాగా నవ్విస్తాడు, ఏడిపిస్తాడు’ అని ప్రేక్షకులు ఎవర్ని భావిస్తారో వారే గొప్ప నటుడు’’ అన్నారు నటుడు అలీ. ఓంకార్‌ దర్శకత్వంలో అశ్విన్‌ బాబు, అవికా గోర్‌ జంటగా తెరకెక్కిన ‘రాజుగారి గది 3’ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది.

ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన అలీ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు, ‘రాజుగారి గది 3’ ఒకఎత్తు. విభిన్నమైన భావోద్వేగాలున్న పాత్రను నాకు ఇచ్చారు ఓంకార్‌. డైరెక్టర్‌గా తనకు చాలా క్లారిటీ ఉంది. ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో రాబట్టుకుంటారు. మొదటి రెండు భాగాలకంటే ఈ సినిమా చాలా బావుంటుంది అన్నారు.ఛోటా కె.నాయుడు విజువల్స్‌ ఈ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లాయిని అన్నారు. ఈ చిత్రంతో అశ్విన్‌ నటుడిగా మరో ఎత్తుకి ఎదిగాడని, సెకండ్‌ హాఫ్‌లో సాయిమాధవ్‌ బుర్రా గారి డైలాగ్స్‌కు థియేటర్‌లో నవ్వులే కురిపిస్తాయన్నారు.

ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు. బ్రహ్మానందం, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్‌ నారాయణగార్లు నాకు నచ్చిన హాస్యనటులు. రైటర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి కామెడీ యాక్టర్స్‌ అయ్యారు. కామెడీ ఎంత మోతాదులో ఉండాలో వాళ్లకు తెలుసు. అందుకే గొప్ప హాస్యనటులుగా పేరు తెచ్చుకున్నారు’’ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: