ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు. 'ఎయిర్ టెల్' మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత రాజ్ కందుకూరి, యంగ్ సెన్సేషనల్ హీరో అడివి శేష్ అతిథులుగా హాజరయ్యారు. ఆపరేషన్ గోల్డె ఫిష్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా  మార్కెట్ మార్కెట్ లో విడుదల అయింది.


దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ "కశ్మీర్ లో 1990లలో కశ్మీర్ పండిట్లకు ఏం జరిగిందో చాలామందికి తెలియదు. కశ్మీర్ ఇష్యూను టచ్ చేద్దామని అనుకున్నప్పుడు రచయిత అబ్బూరి రవి గారు చాలా పరిశోధన చేశారు. నేను, ఆయన కశ్మీర్ పండిట్లను కలిసి... ఏం జరిగింది? ఏంటి? అని పరిశోధన చేశాం. కశ్మీర్ పండిట్లకు జరిగినది బాధాకరమైన విషయమే. కానీ, జనాలకు తెలియని చేసిన ప్రయత్నం ఇది. అందరినీ భాగస్వామ్యులుగా చేసుకుని ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి అబ్బూరి రవి గారు. 'నువ్ డౌట్ పడకు సాయి. నిన్ను నువ్వు నమ్ము. నేను నమ్ముతాను. అందరూ నమ్ముతారు' అని చెప్పి... నా వెన్నంటే ఉన్నారు. స్క్రిప్ట్ దగ్గరనుంచి ప్రతి విషయంలో ఎంతో సహాయం చేశారు. ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్ కి రావడానికి కారణం మెయిన్ బ్యాక్ బోన్ అబ్బూరి రవి గారు. ఘాజీ బాబా పాత్రలో నటించమని ఆయన్ని నటించమని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది. మన పార్లమెంట్ మీద జరిగిన ఎటాక్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్‌‌. ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అయితే తీవ్రవాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఆలోచించి... అమిత్ షా గారి స్ఫూర్తితో మా సినిమాలో రావు రమేష్ గారి పాత్రను డిజైన్ చేశాను.  ‌ నా జేబులో 3500 రూపాయలు ఉన్నప్పుడు, ఆరు కోట్ల సినిమా తీయాలని అనుకున్నప్పుడు... అబ్బూరి రవి గారు ఇచ్చిన ధైర్యం మరువలేనిది. వెయ్యి కోట్లతో సమానం. అదే సినిమాను పూర్తి చేయించింది. ఆ టైం లో నాకు గ్రేట్ సపోర్ట్ ఇచ్చినది... కేశవ్, ఆస్ట్రేలియాలో ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్ ఆశిష్ రెడ్డి, వైజాగ్ దామోదర యాదవ్, నా వైఫ్ ప్రతిభ, పద్మనాభరెడ్డి. ఆర్టిస్టులకు కథ నచ్చడంతో ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామ్యులుగా చేయాలని అడగ్గానే ఎస్ అన్నారు. అందరికీ థాంక్స్. ఇంతమంది కలిసి చేయకపోతే ఈ సినిమా ఉండేది కాదు నేను ఇక్కడ నిలబడే వాడిని కాదు. ఆది నటిస్తాడో? లేదో? అనుకున్నాను. తను సినిమా చేయడానికిి ముఖ్య కారణం సాయి కుమార్ గారు. ఆయన కథ విని చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ అన్నారు. ఆయనకూ థాంక్స్. 'వందేమాతరం' అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో... ఈ సినిమాకు థియేటర్లలో రియాక్షన్ అలా ఉంటుంది" అన్నారు.  ‌


ఆది సాయికుమార్ మాట్లాడుతూ "కశ్మీర్ ప్రతికూల పరిస్థితులు, వాతావరణం మధ్యలో కథలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. సాయి కిరణ్ అన్న, అబ్బూరి రవి గారు నాకంటే ముందే అక్కడికి వెళ్లారు. నీళ్లు కింద పోస్తే సెకన్లలో మంచులా మారేది. అటువంటి పరిస్థితుల్లో మేం షూటింగ్ చేశాం. నిజంగా... కశ్మీర్ కి వెళ్లి, ఎన్.ఎస్.జి కమాండో డ్రెస్ వేసుకుని షూటింగ్ చేయడం చాలా గర్వంగా అనిపించింది. అక్కడ కొంత మంది ఆర్మీ అధికారులను కలిశాను. వాళ్లు చేస్తున్న త్యాగాలను కళ్లారా చూశాను. ఈ రోజు మనమంతా ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నామంటే ఇండియన్ ఆర్మీనే కారణం. వాళ్లకు సెల్యూట్ చేయాలి. ఈ సినిమాతో చాలా నిజాలు బయటకు వస్తాయి. సాయి కిరణ్ గారు కథ చెప్పి... ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ పాత్రకు నిన్ను అనుకుంటున్నానని చెప్తే నేను నమ్మలేదు. సూట్ అవుతానా? లేదా? అని డౌట్ పడ్డాను. నన్ను నేను నమ్మలేదు. కానీ సాయికిరణ్ నన్ను నమ్మారు. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అక్టోబర్ 18న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. నా కోసమో... ఎవరి కోసమో కాదు... సాయికిరణ్ అడివి కోసం. ఈమధ్య నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. నాకు ఈ సక్సెస్ ఇంపార్టెంట్‌. ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు ప్రౌడ్ ఇండియన్ అనే ఫీలింగ్ వస్తుంది" అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: