'సైరా' చిత్రం ప్రేక్షకులకు అంత గొప్పగా కనెక్ట్ కావడానికి ప్రధాన కారణం అందులోని దేశభక్తి అనే పాయింట్.  స్వాతంత్ర్యం కోసం తొలి సమరం ప్రారంభించిన వీరుడి కథ కావడం, ఆ పోరాటం కోసం ప్రాణాల్నే అర్పించడంతో 'సైరా' చిత్రం ఒక దేశభక్తుడి చిత్రంగా పేరు తెచ్చుకుంది.  సినిమా చూసిన అందరూ కూడా ఈ తరం యువత తప్పక చూడాల్సిన చిత్రమని, సినిమా చూశాక స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల పట్ల, ప్రస్తుతం దేశం కోసం పనిచేస్తున్న సైనికుల పట్ల గౌరవం రెట్టింపైందని అంటున్నారు.   అందుకే ఈ సినిమాను ఇండియన్ ఆర్మీకి చూపాలని కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ సంస్థ ధీరజ్ ఎంటెర్ప్రైజెస్ సంకల్పించారు.  ఈ వారంలో కర్ణాటకలోని పలుచోట్ల వారి కోసం సుమారు 60 షోలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.  ఇదే పద్దతని ఏపీ, తెలంగాణల్లో కూడా అమలుచేసి సైనికులకు, పోలీసులకు ప్రత్యేకంగా చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడలి. ప్రస్తుతం కేసీఆర్ గవర్నమెంట్ సినిమాలు చూపించే మూడ్ లో లేదనుకోండి 

సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి ఈ రోజు భేటీ అయిన విషయం తెలిసిందే.  చిరంజీవి దంపతులను జగన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు.  మెగాస్టార్ కి శాలువా కప్పి  బొబ్బిలి వీణను బహుకరిస్తూ  చిరంజీవిని  జగన్  సన్మానించారు.  అనంతరం మెగాస్టార్  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విశేషాలను జగన్‌ కి వివరిస్తూ..  సినిమాని చూడాలని మెగాస్టార్  సీఎంను కోరారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆయన్ను చిరు కలవనుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ మీటింగ్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.  కాగా  ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదట,  'సైరా' చిత్రానికి స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చినందుకుగాను కృతఙ్ఞతలు తెలిపటానికే మెగాస్టార్ జగన్ ను కలిశారట. అయితే  ఈ సమావేశం సందర్భంగా సైరా మూవీ వినోద పన్ను పై చిరంజీవి జగన్‌ తో చర్చించినట్లు తెలుస్తోంది.  ఇక ముఖ్యమంత్రి త్వరలోనే సైరా సినిమాను వీక్షించనున్నారని తెలుస్తోంది.  

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా  భారీ అంచనాల నడుమ  వచ్చిన 'సైరా' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. నిన్న ఆదివారం  కూడా సైరా తెలుగురాష్ట్రాలలో  కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టింది.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా   సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్  ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: