పూజా హెగ్డే ఎంత వద్దనుకుంటున్నా టాలీవుడ్ పూజే చేస్తోంది. ఆమె కావాలి అంటోంది. పూజ అందాలకు దాసోహం అంటోంది. ఈ మధ్యకాలంలో ఇంతలా ఓ హీరోయిన్ కోసం టాలీవుడ్ సాష్టాంగం పడడం అన్నది ఒక్క పూజాకే చెల్లింది. పూజా కావాలంటే కొండ మీద కోతికి తెచ్చేందుకు కూడా టాలీవుడ్ తయారుగా ఉంది. అది పూజా క్రేజ్ అంటున్నారు. అందంగా ముద్దుగా ఉండే పూజా టాలీవుడ్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయింది.


ఇక్క మాటలో చెప్పాలంటే గద్దలకొండ గణేష్ మూవీలో పూజా చేసిన స్పెషల్ క్యారక్టర్  ఆ సినిమా విజయంలో ప్రధాన భాగమైంది. వెల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ఒరిజినల్ క్రియేటర్, దర్శక బ్రహ్మ కె రాఘవేంద్రరావు సైతం పూజా ఆ సాంగ్ రీమిక్స్ ఇరగదీసిందని అన్నారంటే పూజా అవార్డ్ కొట్టేసినట్లేగా మరి. ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు గానూ పూజా అక్షరాలా కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుందట.


ఇవన్నీ ఇలా ఉంటే పూజ బర్త్ డే నిన్న జరిగింది. ఆమె ఇపుడు తెలుగులో జాన్ అన్న మూవీని ప్రభాస్ పక్కన చేస్తోంది. అలాగే అల వైకుంఠపురంలో మూవీని కూడా చేస్తోంది. ఈ రెండు మూవీస్ మేకర్స్ బర్త్ డే పూజ కోసం ప్రత్యేకంగా పోస్టర్లు రిలీజ్ చేశారంటే పూజ స్టార్ డం ఏ రేంజిలో ఉందో అర్ధమవుతోందిగా 


ఇక పూజా బాలీవుడ్ వైపు చూస్తూంటే తమ మూవీస్ లో యాక్ట్ చేయమని టాలీవుడ్ పరుగులు పెడుతోంది. మరి పూజ నచ్చిన వాటిని ఒప్పుకున్నా కూడా ఆమె చేతిలో ఎవరికీ లేనన్ని మూవీస్ ఉంటాయి. దటీజ్ పూజా అంటున్నారు. మరి పూజ  టాలీవుడ్ జపం చేస్తున్నా కూడా బాలీవుడ్ మీదే మోజు పెంచుకుందని అంటున్నారు. అయితే ఆమె కెరీర్ టాప్ రేంజిలో ఉండాలంటే మాత్రం టాలీవుడే బెస్ట్ అంటున్నారు శ్రేయభిలాషులు.



మరింత సమాచారం తెలుసుకోండి: