ఒక్కోసారి మనకు తెలియకుండానే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.  ఒక్కోసారి అదే అదృష్టం చెప్పకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఏదైనా అంతే.. చివరకు సినిమా రంగం అయినా అలానే ఉంటుంది.  గోల్డెన్ స్పూన్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తులు ఒక్కోసారి ఆడియన్స్ పల్స్ ను అర్ధం చేసుకోవడంలో విఫలం అవుతుంటారు.  అలా విఫలైన వ్యక్తుల్లో బాలయ్య కూడా ఒకరు.  ఒకప్పుడు వరస హిట్స్ ఇచ్చిన ఈ నాదనమూరి హీరో.. అసలు ఆ సినిమాలు చేసింది బాలకృష్ణానా అనిపించే విధంగా సినిమాలు చేసి హీరోగా మచ్చ తెచ్చుకున్నాడు.  


అలాంటి అద్భుతమైన కళాఖండాల్లో ఒకటి పలనాటి బ్రహ్మనాయుడు. బాలకృష్ణ కోసం రచయిత విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి కథను రెడీ చేశారు.  పరుచూరి బ్రదర్స్ దానికి మాటలు రాస్తున్నారట.  ఈ సినిమాకు సంబంధించిన కేరళ సీన్స్ కు డైలాగులు రాస్తున్న సమయంలో దర్శకుడు బి గోపాల్ వచ్చి.. ఆ కథ కాదని, కన్నడంలో విజయం సాధించిన సినిమాను బాలయ్య ఒకే చేశారని.  దానిని తెలుగుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి సినిమాగా తీయాలని అన్నారు.  


ఒకవేళ బాలయ్య కన్నడ సినిమా గురించి మాట్లాడకపోయి ఉంటె.. సింహాద్రి సినిమాను బాలకృష్ణ చేయాల్సి వచ్చేది.  బి గోపాల్ దర్శకత్వం వహించాల్సి వచ్చేది.  ఆ సినిమా ఎలా ఉండేదో మరి.  ఇది వేరే విషయం అనుకోండి.  కన్నడ సినిమాను మార్చి పలనాటి బ్రహ్మనాయుడు సినిమాగా రెడీ చేశారు.  ఇందులో జయప్రకాశ్ రెడ్డి కుర్చీ రావడం.. తొడకొడితే రైలు వెనక్కి వెళ్లడం వంటి సీన్స్ మరీ ఎబ్బెట్టుగా ఉన్నాయి.  రియాలిటీ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.  


ఇది ప్రేక్షకులు అస్సలు నచ్చలేదు.  చివరకు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ సీన్స్ చూసి నవ్వుకున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  తొడకొడితే కుర్చీ వచ్చే సీన్ తీసిన తరువాత యూనిట్ అంతా నవ్వుకుందట.  దీంతో ట్రైన్ సీన్ ఆపేయాలని అనుకున్నారు.  కానీ, ఆ సీన్ బాగుంటుందని చెప్పి తీశారు.  మొదట రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చే సమయంలో ఆకాశంలో మెరుపులు రావడం.. ఆ తరువాత బాలయ్యలో ఎన్టీఆర్ కనిపించడంతో ట్రైన్ డ్రైవర్ రైలును వెనక్కి పంపించడం వంటివి పెడదామని అనుకున్నారు.  కానీ చివరకు తొడకొడితే రైలు వెనక్కి వెళ్లడం సీన్ పెట్టారు.  సినిమాను మర్చిపోయినా.. ఇప్పటికి చాలామంది బాలయ్య ట్రైన్ సీన్ ను పదేపదే యూట్యూబ్ లో చూసుకొని నవ్వుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: