ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్రకు సంబంధించి తీసిన ‘సైరా’ కు విజయంతో పాటు ప్రశంసలు కూడ దక్కడంతో ఇలాంటి చారిత్రాత్మక పాత్రలకు బాలకృష్ణ మరింత న్యాయం చేస్తాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ‘సైరా’ లాంటి ఉత్తేజకరమైన కథల కోసం ఇండస్ట్రీలో అన్వేషణ మొదలైంది. 

ఇలాంటి పరిస్థితులలో నందమూరి బాలకృష్ణకు సన్నిహితుడైన ఒక భారీ నిర్మాతకు ఒక ప్రముఖ రచయిత అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతానికి చెందిన కొక్కంటి పాలెగాడి జీవితానికి సంబంధించిన కథను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ‘కొక్కంటి’ సంస్థానాధీశుడు అయిన ఎర్రివీర నాగముని మల్లప్ప నాయుడు తన ఇద్దరు అనుచరులు అయిన పెద్ద గుబిలి చిన్నగుబిలితో చేసిన సాహసాలకు సంబంధించిన కథలు ఇప్పటికీ అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారని తెలుస్తోంది.  

ఆ కాలం నాటి బ్రిటీష్ దొరల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ కొక్కల్లు సంస్థానానికి 72 గ్రామాలను తమ రాజ్యంగా ప్రకటించుకుని అప్పటి బ్రిటీష్ దొరలకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలనాటి బ్రిటీష్ కలెక్టర్ థామస్ మన్రోను అతలాకుతలం చేసిన ఈ పోరాట యోధుడి జీవిత కథలో ఎన్నో సినిమాకు పనికి వచ్చే అంశాలు ఉన్నాయని ఆ ప్రముఖ నిర్మాత దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.  

అంతేకాదు కొక్కల్లు పాలెగాళ్లు పౌరుషాలకు ప్రతిష్టలకే పరిమితం కాకుండా పాలనాదక్షత ప్రజాసంక్షేమానికి పాటుపడ్డారని చరిత్రను బట్టి తెలుస్తోంది. వీరి పాలనలో నాటి బ్రిటీష్ దొరలు పోలీసులు కనీసం ఆ సంస్థానానికి రావడానికి కూడ భయపడిపోయేవారట. ఇలాంటి కథ బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి చాల బాగుంటుందని ఆ రచయిత చెప్పడంతో ఆ ప్రముఖ నిర్మాత ఈ కథను గురించిన విషయాలు బాలకృష్ణ దృష్టికి తీసుకు వచ్చినట్లు టాక్. అయితే ప్రస్తుతం బాలయ్య మార్కెట్ విపరీతంగా పడిపోయిన నేపధ్యంలో ఇలాంటి భారీ సినిమాను ఎవరైనా సాహసించి తీసినా మార్కెట్ ఎంత వరకు అవుతుంది అన్నదే సందేహం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: