నభా నటేష్...నన్ను దోచుకుందువటే అంటూ వచ్చి యూత్ గుండెలను దోచేసింది. టాలీవుడ్లో పాగా వేసి మరీ తన సత్తా చాటుకుంది. నఖశిఖ పర్యంతం అందాల ఆరోబోతతో నభా  శ‌భాష్ అనిపించేసింది. అదిరిపోయే హాట్ లుక్స్ తో కుర్రకారుని వెర్రెత్తించేసింది. అబ్బా నభా అంటున్నా వదలకుండా అందం దెబ్బతో అదరగొట్టేస్తోంది. లేటేస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్ నభాకు బిగ్ బ్రేక్ ఇచ్చేసింది.


ఇపుడు నభా రవితేజా పక్కన నటించిన డిస్కో రాజా మూవీ డిసెంబర్లో రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీలో కూడా నభా హాట్ హాట్ అందాలే ప్రధాన ఆకర్షణ అంటున్నారు. తన వేడి వేడి సోయగాలతో చిట్టి గుండెలను చిత్తు చేయాలనుకుంటోందట. నేరుగా వెండితెర మీద నుంచి పడుచు హ్రుదయాలలో పడక వేసేందుకు పక్కా ప్లాన్ తో నభా సిద్ధమైపోయింది.


ఇదిలా ఉండగా అందాల ఆరబోతకు నేను రెడీ అంటున్న నభా రానున్న మూవీస్ కూడా కిర్రెక్కించేలా ఉంటాయని చెబుతోంది. నేను రెడీ మీరు రెడీనా అని సవాల్ చేస్తోంది. నభా నటేష్ వంటి అందగత్తె ఇంత బిగ్ ఆఫర్ ఇచ్చిన తరువాత ఫిల్మ్ మేకర్స్ తగ్గుతారా. నభ అందాలే పెట్టుబడిగా సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నారుట.


అయితే కండిషన్స్ అప్లై అని నభా అన్న ఒక్క మాట వారిని షాక్ తినిపిస్తోందట. నభా ఎన్నడూ లేని విధంగా తన రేట్ గట్టిగానే పెంచేసిందట. ఆమె మొదటి మూవీ నన్ను దోచుకుందువటేకి పదో పదిహేనో తీసుకునేది ఇస్మార్ట్ శంకర్ మూవీకి కూడా పాతిక లోపేనంటున్నారు. అయితే కొత్త మూవీస్ విషయంలో మాత్రం రేటు రెట్టింపు చేసేందిట. యాభై లక్షలకు తగ్గనని ఈ ముద్దుగుమ్మ చెబుతూంటే నిర్మాతలు పరేషాన్ అవుతున్నారుట. మరి నభాతో మూవీస్ అంటే హాటే కాదు, యమ కాస్ట్ లీ గురూ అంటోంది టాలీవుడ్.


మరింత సమాచారం తెలుసుకోండి: