సోమవారం ఎపిసోడ్ లొ నామినేషన్ ప్రక్రియలో పెద్ద రభస జరిగింది. ఇంట్లో తమకు కావాల్సిన ర్యాంక్ కోసం పోటీ పడటంలో చర్చించుకుని చివరకు అందరూ విఫలమయ్యారు. అయితే ఈ చర్చలు కొంత వరకు సరిగ్గానే జరిగినా చివరికి ఎటెళ్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా శివజ్యోతి, వరుణ్ ల చర్చ ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోయింది.ఇంతవరకు ఎప్పుడు అరవని శివజ్యోతి ఈ నామినేషన్ సమయంలో పెద్ద పెద్దగా అరిచి వాదించింది.


శివజ్యోతి మూడవ ర్యాంక్ కోసం వితికా, వరుణ్ లతో చర్చకి దిగింది. అయితే అది కాస్తా వేరే మలుపులు తీసుకుని వాగ్వాదానికి దారి తీసింది. అయితే ఇక్కడ వితికాతో కంటే ఎక్కువగా వరుణ్ తోనే జరిగింది. దానికి కారణం వరుణ్ తన మూడవ ర్యాంకుని వితికాకి ఇవ్వడమే. వరుణ్ తో ఆమె చేసిన వాదనలో కొంత తప్పు ఉండవచ్చు. కానీ మొత్తం వాదనే తప్పని చెప్పలేం. అయితే వరుణ్ శివజ్యోతితో వాదించేటపుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు.


అదే ఇప్పుడు అతన్ని చిక్కుల్లో పడేసింది. ఈ వాదన వల్ల శివజ్యోతి ఎంత నష్టపోతుందో, వరుణ్ కూడా అంతే నష్టపోయేలా ఉన్నాడు. ఎందుకంటే వరుణ్ ఏదైనా గొడవలో ఒకానొక టైమ్ వరకే కరెక్ట్ గా ఉంటాడు. ఎదుటి వారు ఇరిటేట్ చేస్తే, తన మీద తాను కంట్రోల్ కోల్పోయి ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడతాడు. వరుణ్ ఇలా చేయడం కొత్తేమీ కాదు. మహేష్ విషయంలోనూ, రాహుల్ విషయంలోనూ ఇంతకుముందు జరిగింది.


ఇప్పుడు శివజ్యోతి విషయంలో కూడా అలానే జరిగింది.  తాను ఇండివిడ్యువల్ కంటెస్టెంట్ అని చెప్పుకున్న వరుణ్ తన భార్యకి సపోర్ట్ చేసి, నా భార్య కాబట్టి చేశానని చెప్పడం డబల్ స్టాండర్స్ అయితే, వాదనలో ఒక లిమిట్  వరకు ఆగకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం రెండో తప్పు. దీనివల్ల అతని అభిమానుల్లో అతని పట్ల కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఆ ప్రభావం ఇప్పుడే కనబడకపోవచ్చు. కానీ ఫైనల్ వరకు ఏ సమయంలోనైనా ప్రమాదం తప్పేలా లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: