అల్లు అరవింద్.. తెరపై కనిపించక పోయినా తెర వెనుక చక్రం తిప్పగల సమర్ధుడు ఈయన. అల్లు రామలింగయ్య సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు . సినీ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఫేమస్ ప్రొడ్యూసర్ అయ్యారు.

      అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఆయన తన ఆస్తి పంపకాలు చేయాలని డిసైడ్ అయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు చూస్తే. ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ సాధించిన అల్లు అరవింద్ వయసు 70 సంవత్సరాలు దాటింది. సో ఇన్నాళ్లు వ్యాపారవేత్తగా రాణించిన ఆయన ఇకపై విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ మేరకు ఆయన బాధ్యతలను కొడుకులకు అప్పగించాలని డిసైడ్ అయ్యారట. ముగ్గురు కొడుకులు అందరికీ.. తన వ్యాపార లావాదేవీలు, ఆస్తుల బాధ్యతలను ఇకపై ముగ్గురు కొడుకులు చేసుకునేలా అల్లు అరవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

       ఈ మేరకు ముగ్గురు తనయులకు ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయాయనే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా అల్లు అరవింద్ ఇంట్లో పరిణామాలు గత కొంతకాలంగా అల్లు అరవింద్ ఇంట్లో మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అల్లు అర‌వింద్ అస్తుల పంప‌కం చేశార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇన్నాళ్లు అల్లు అరవింద్ కుమారులుగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. ఆయనకు అల్లు వెంకటేష్ అనే పెద్ద కుమారుడు ఉన్నాడనే విషయం అరవింద్ సన్నిహితులకు తప్ప ప్రేక్షకులకు తెలియదు.

           అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ కానీ ఇటీవలే అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ కూడా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఏకంగా నిర్మాతగా మారి వరుణ్ తేజ్ హీరోగా సినిమా మొదలు పెట్టేశారు. దానికి అల్లు అరవింద్ ప్రజెంట్స్ అనే పేరు కూడా పడింది. ఈ కోణంలోనే గీతా ఆర్ట్స్ వ్యవహారాలను అల్లు వెంకటేష్ చేసుకునేలా అరవింద్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే అల్లు అర్జున్ గీత ఆర్ట్స్ మిస్ అయినట్లే. కాబట్టి ఈ లెక్కన చూస్తే అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు జరుగుతున్నాయనే వార్తలో కొంతైనా నిజముందని అర్థం చేసుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: