"రకుల్ ప్రీత్ సింగ్" కుర్ర కారు గుండెల్లో ఈమె ఒక దేవకన్య,డ్రీమ్ గర్ల్ అంటూ ప్రాచుర్యం పొందిన వెండితెర అందాల తార ఆమె ఇప్పటివరకు మహేష్‌, ఎన్టీఆర్‌, చరణ్‌  ఇలా ఒకరిద్దరు మినహా ఇండస్ట్రీలో టాప్‌ హీరోలు అందరితోను నటించేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఇంకా ఒక హీరోతో నటించాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ అండ్‌ హ్యాపెనింగ్‌ స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండతో నటించాలనేది రకుల్‌ కోరిక అట.ఒక్కసారైనా అలాంటి రొమాంటిక్ హీరోతో నటించాలని ఆమె కోరుకుంటున్నారంట.

అర్జున్‌రెడ్డి చూసిన దగ్గర్నుంచీ అతనితో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తోందట. అతని నటన చాలా బాగా నచ్చిందని, అందుకే కలిసి నటించాలని వుందని రకుల్‌ చెప్పింది. విజయ్‌తో నటించే అవకాశం వస్తే ఇక రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పేస్తానని కూడా అంటోంది. మరి విజయ్‌ దేవరకొండ ఈ మాట విన్నాడో లేదో తెలీదింకా. హీరోయిన్ల పరంగా హాట్‌ అండ్‌ హ్యాపెనింగ్‌ వాళ్లతోనే చేయాలనే ఆంక్షలు అతనికి లేవు. కానీ రకుల్ లాంటి పెద్ద హీరోయిన్ చేస్తాను అంటే కాదనడు అనే నమ్మకం మాత్రం అందరిలో ఉంది.

ఎవరితో అయినా నటించేయడానికి ఓకే అంటూ వుంటాడు. కాబట్టి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు లేవనేది విజయ్‌కి సమస్య కాకపోవచ్చు. ఎలాగో ఒక టైమ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిన నటి కాబట్టి రకుల్‌ ప్రీత్‌ని తన తదుపరి చిత్రాల కోసం కన్సిడర్‌ చేయవచ్చు. అవకాశాలు తగ్గిన టైమ్‌లో సీనియర్‌ హీరోలతో నటించేయడం మాత్రం యువ హీరోల సరసన అవకాశాలకి రకుల్‌కి అవరోధంగా మారవచ్చు అని కూడా అనుకుంటుంది ఆ అమ్మడు ఒక్కసారి విజయ్ చేస్తాను అనాలే గాని ఎలాంటి సీన్ లో చేయడానికైనా వెనుకాడబోనని ఆమె స్పష్టం చేసినట్టు అర్థం అవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: