మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వరుణ్ తేజ్ తనదైన శైలిలో విభిన్నమైన చిత్రాలను చేస్తూ ముందుకెళ్తున్నాడు. వరుణ్ చేసిన చిత్రాలను గమనిస్తే, వరుణ్ కి మంచి టేస్ట్ ఉందని తెలుసుకోవచ్చు. మొదటి సినిమా ముకుంద నుండి మొన్న వచ్చిన "గద్దలకొండ గణేష్" వరకూ అన్ని విభిన్నమైన చిత్రాలను చేస్తూ తన నటునతో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న వరుణ్ తేజ్ తన కెరియర్లో పదో సినిమాని మొదలెట్టేశాడు.


మొన్నటి వరకు అన్ని సాఫ్ట్ క్యారెక్టర్లే చేస్తూ వచ్చిన వరుణ్, మొదటి సారిగా గద్దలకొండ గణేష్ సినిమాలో మాస్ పాత్రలో మెరిశాడు. సాఫ్ట్ క్యారెక్టర్లని ఎంత బాగా డీల్ చేశాడో మాస్ ని కూడా అంతే బాగ డీల్ చేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ లో వరుణ్ చక్కగా ఒదిగిపోయాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ళను సాధించింది. అంతే కాదు వరుణ్ కెరీర్లో మంచి హిట్ గా నిలిచింది.


గద్దలకొండ గణేష్ ఇచ్చిన విజయంతో వరుణ్ తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేశాడట. అంతా ఇంతా కాదు ఏకంగా రెండింతలు పెంచాడని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. వరుస సినిమాలు సక్సెస్ అవుతున్న సమయంలో  రెమ్యునరేషన్ పెంచడం కరెక్టని భావించాడట. అప్పటి వరకు మాస్ సినిమా చేయని వరుణ్, గద్దలకొండ గణేష్ రూపంలో మాస్ విజయం తోడవడంతో మాస్ ఆడియన్స్ ని కూడా అలరించగలడనే నమ్మకంతోనే రెమ్యునరేషన్ ని పెంచాడని అంటున్నారు.


ఇంతకుముందు 4 నుండి  కోట్లు తీసుకునే వరుణ్ ఇప్పుడు ఏకంగా 7 నుండి 8 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. వరుణ్ సినిమాల్లో "అంతరిక్షం" మినహాయిస్తే మిగిలిన సినిమాలన్నీ నిర్మాతలకి లాభాలు పంచి పెట్టడంతో ఎనిమిది కోట్లయినా ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారట నిర్మాతలు.



మరింత సమాచారం తెలుసుకోండి: