మాస్ మహా రాజా రవితేజ ,ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్  వి ఐ ఆనంద్  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ   'డిస్కోరాజా'.  ప్రస్తుతం ఈచిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈచిత్రం నుండి  మొదటి సాంగ్ ను  ఈనెల 19న విడుదలచేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని  క్రిస్మస్ కానుకగా  డిసెంబర్ 20న విడుదలచేయనున్నామని ఇటీవల మేకర్స్  అధికారికంగా ప్రకంటిచారు. అయితే తాజాగా  చిత్ర బృందం  ఈ విడుదలతేదీని మార్చాలనే యోచన లో ఉన్నట్లు  వార్తలు వస్తున్నాయి.  ముందుగా అనుకున్నట్లుగా కాకుండా  ఈ చిత్రాన్ని  వచ్చే ఏడాది  ఫిబ్రవరి లో లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే విడుదల వాయిదాపడడానికి కారణాలు తెలియాల్సివుంది.  ఇక   ఈవార్తల గురించి అధికారిక ప్రకటన  వెలుబడాల్సి వుంది.  ఇదిలా ఉంటే ఈ చిత్రం యొక్క టీజర్ కూడా దసరా కు విడుదలకావాల్సి ఉండగా  ఎందుకనో హోల్డ్ లో పెట్టారు.  సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో  నాభా నటేష్ , పాయల్ రాజ్ పుత్ , తాన్యా హాప్  కథానాయికలుగా నటిస్తున్నారు. 



ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ ఫై  రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో  బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.  ఇక గత ఏడాది  టచ్ చేసి చూడు , నేల టిక్కెట్టు , అమర్ అక్బర్ ఆంటొని రూపంలో  మూడు  భారీ డిజాస్టర్లను  చవిచూసిన  రవితేజకు  డిస్కోరాజా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం తో రవితేజ హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: