బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంత కాలం నుండి వరుస పరాజయాలతో కెరియర్ ని కొనసాగిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. ఇదే క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ డైరెక్టర్లు తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం మరియు అదే విధంగా సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ లతో బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు చేస్తున్న సినిమాలు సూపర్ సూపర్ హిట్ కావడంతో చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలు సౌత్ కథలపై మరియు డైరెక్టర్ ల పై మోజు పడుతున్నారు. ఇందు మూలంగానే వరుస పరాజయాలతో సతమతమవుతున్న షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో పని చేసి 'కబీర్ సింగ్' సినిమా చేసి అదిరిపోయే హిట్ అందుకొని తన కెరీర్ లోనే అత్యంత ఫాస్ట్ మరియు రికార్డు ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా గా 'కబీర్ సింగ్' తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.


ఇదే క్రమంలో ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమౌతున్న షారుక్ ఖాన్ కూడా సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసినట్లు సమాచారం. దీంతో షారుక్ ఖాన్ తమిళ ఇండస్ట్రీ డైరెక్టర్ అట్లీ తో పనిచేయటానికి సిద్ధమైనట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. ఈ క్రమంలో ఇప్పటికే షారుక్ ఖాన్ కె ఓ స్టోరీ లైన్ కూడా డైరెక్టర్ అట్లీ వినిపించినట్లు సమాచారం. ముఖ్యంగా డైరెక్టర్ అట్లీ ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీలో 'మెర్శల్', 'తేరి' వంటి కథలతో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకోవడం జరిగింది.


వరుసగా విజయ్ కి 2 బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ అట్లీ తాజాగా హ్యాట్రిక్ కొట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు...ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న బిగిల్ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. తెలుగులో 'విజిల్' టైటిల్ తో రిలీజ్ కాబోతోంది. దీపావళికి రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఆ సినిమా రిలీజ్ అనంతరం అట్లీ - షారుక్ ఖాన్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నట్లు సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. మరీ షారుక్ కెరియర్ ని సౌత్ ఇండస్ట్రీ ఆదుకుంటుందో...లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: