నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా బాగుందనిపించినప్పటికీ కలెక్షన్ల పరంగా చాలా వీక్ అని వినిపించింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదల అయ్యాక ఆ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఈ క్రమంలో నానిపై చాలా విమర్శలు వచ్చాయి. రిజెక్టెద్ కథలనే నమ్ముకుంటున్నాడనే టాక్ కూడా వినిపించింది.


మిగతా హీరోలు మేము చేయము అని రిజెక్ట్ చేసిన కథలని నాని చేస్తున్నాడని, అలా చేయడం వల్లనే సినిమాల ఫలితం ఇలా ఉందని ఆయన అభిమానులు గోల చేశారు. ఏదేమైనా సినిమా రిలీజ్ అయింది. అనుకున్నంత పేరైతే రాలేదు. డబ్బులు కూడా రాలేదు. అయితే ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో "వి" అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది.


అయితే ఈ సినిమా తర్వాత ఏం సినిమా చేయాలా అని ఆలోచనలో పడ్డాడట. ఇంతకు ముందు నాని ఒక కథని ఓకే చేసే ముందు చాలా కథలని వినే వాడట. ఆ చాలా కథల్లో తనకి బాగా నచ్చిన కథని ఎంచుకుని ఓకే చేసే వాడట. అయితే ఇప్పుడు అదే పద్దతిని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాడట. అందుకే రోజుకి రెండు, మూడు కథలు వింటున్నాడట. ఏ కథ మీద తొందరగా ఒక నిర్ణయానికి రావట్లేదట.


ప్రస్తుతం "నిన్నుకోరి" దర్శకుడు శివనిర్వాణ ఒక కథ చెప్పాడట. అది కూడ ఇంకా హోల్డ్ లోనే పెట్టాడట. నందినీ రెడ్డి కూడా తన కథని వినిపించిందట. కానీ ఆ కథకి కూడా నాని కన్విన్స్ అవలేదట.
కథల విషయంలో నాని ఇంత  జాగ్రత్త పడుతున్నాడంటే, మరో మంచి కథతో మన ముందుకు వస్తాడని అర్థం అవుతుంది. మరి ఆ అదృష్టం ఏ దర్శకుడికి ఉందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: