తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రవిబాబు మాట్లాడుతూ, అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.  మొదట్లో నేను యాడ్స్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడిని.  ఆ తరువాత నా ఆలోచనలు సినిమా వైపుకు మళ్లాయి. మొదట్లో నాకు నాగార్జున గారితో సినిమా చేయాలని ఉండేది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు.  ఇక బాలకృష్ణగారితో నాకు మంచి సాన్నిహిత్యం వుంది .. తనతో ఒక సినిమా చేయమని ఆయన నన్ను అడుగుతుంటారు.  ఆయన  ఒక కథ చెప్పవయ్యా  అంటే నేను ఇంతవరకూ చెప్పలేదు.  


టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతోమంది హీరోల తనయులు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  అయితే ఒకప్పుటి ప్రతినాయకుడు చలపతిరావు తనయుడు రవిబాబు ‘అల్లరి’ మూవీతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  కొత్తగా వెరైటీ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించారు రవిబాబు. తాజాగా ఆవిరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువగా యాడ్స్ ఎక్కువగా తీస్తూ ఉండేవాడినని..తర్వాత నా దృష్టి సినిమాలపై పడిందని అన్నారు.  మొదట్లో నాకు నాగార్జున గారితో సినిమా చేయాలని ఉండేది.

కానీ అప్పట్లో అది కుదరలేదు.  నేను ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాను..నా దగ్గరున్న కథల్లో ఎవరు దేనికి ఫిట్ అవుతారనే నేను చూసుకుంటాను. హీరోను అనుకుని కథను తయారు చేసుకోవడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం.  నాకు బాలయ్యతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి..తనతో ఒక సినిమా చేయాలని అనేవారు, కానీ ఆయనతో సినిమా తీయాలంటే మంచి కథ ఉండాలని అన్నాను. 

టాలీవుడ్ లో నా కెరీర్ బిగినింగ్ లో స్టార్ హీరోలతో సినిమాలు తీయాలంటే ఆ స్థాయిలో నిర్మాతలు కావాలి.  అలాగే నా కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉంటాయి.  ముందుగా కథను సిద్ధం చేసుకుని దానికి ఎవరు సెట్ అవుతారనేది ఆలోచించడం కరెక్ట్ పద్ధతి. అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేయడం కుదరలేదు అని చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: