పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే అభిమానుల్లో  అదో  తెలియని ఉత్సాహం. అది రాజకీయాలు అయినా సినిమాలైనా ఆయన క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్నాడు. ఇక టాలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే అందరూ టక్కున పవన్ కళ్యాణ్ పేరు చెప్పేస్తారు. ఇక ఆ తర్వాత జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించి జనాల్లోకి వెళ్లారు పవన్ కళ్యాణ్. 

 

 

 

 

 

 పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత రాజకీయాలను బాగా ప్రభావితం చేస్తారని... రాజకీయాల్లో కూడా  రాణిస్తారని అందరూ అనుకున్నారు.కానీ  ఆంధ్రప్రదేశ్ లో  తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు పవన్  కళ్యాణ్ . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలవగా.. జనసేన పార్టీ ఒక్కటంటే ఒక్క సీట్లు గెలిచింది. ఇక ఎన్నికల్లో ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల బాట పడతారని అందరు ఊహించారు . కానీ తన జీవితం మొత్తం జనసేవకి  అంకితమని సినిమాల్లోకి రావడం అనే ఆలోచన లేదని  పవన్ కళ్యాణ్ పలుసార్లు స్పష్టం చేశారు. 

 

 

 

 

 

 అయినప్పటికీ పవన్ ఆ దర్శకుడితో  సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడితో సినిమా చేస్తున్నారంటూ కొత్త కొత్త వార్తలు హల్ చల్  చేస్తూనే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినీ ప్రపంచానికి దూరంగా ఉన్నప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం  లేదు. అయితే తాజాగా ఇలాంటి వార్తే  మరొకటి వైరల్ అవుతుంది. దర్శకుడు క్రిష్  మంచి కథతో పవన్ కళ్యాణ్ వినిపించి   మెప్పించాడని  దీంతో పవన్ కథ నచ్చి క్రిష్ తో సినిమా  చేయడానికి ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. కృష్  దర్శకత్వంలో త్వరలోనే పవన్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని సినీవర్గాల్లో  క చర్చ నడుస్తుంది. ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా మొదలవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అవుతుంది  అనేది మాత్రం తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: