హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో వరుణ్ సందేశ్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అతనికి "కొత్త బంగారు లోకం" లో కూడా అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. దాంతో వరుణ్ సందేశ్ కి విపరీతంగా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల తర్వాత వరుణ్ కి చెప్పుకోదగ్గ హిట్ ఏమీ రాలేదు. ప్లానింగ్ లో తేడా వల్ల అతని కెరియర్ అటకెక్కేసింది.


సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో బిగ్ బాస్ కి వచ్చిన వరుణ్ అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. సతీ సమేతంగా వచ్చిన వరుణ్ మొన్నటి వరకు అందరితో పాటు తన భార్యని కూడా కంటెస్టెంట్ లాగానే చూశాడు. చాలా సార్లు వితికాతో గొడవ పడ్డాడు కూడా.  ఇదంతా చూసి వరుణ్ చాలా జెన్యూన్ అనీ, చాలా బాగా గేమ్ ఆడుతున్నాడని, టైటిల్ ఫేవరేట్లలో వరుణ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు వరుణ్ పై ప్రేక్షకుల్లో ఆ ఇంప్రెషన్ లేదు.


ఎందుకంటే ఫైనల్ దగ్గర పడుతున్న కొద్దీ వరుణ్ ప్రవర్తనలో  మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు భార్యని ఒక కంటెస్టెంట్ లాగా చూసినివాడు ఇప్పుడు తనకి ఫేవర్ గా ఉండటం ప్రేక్షకులకి నచ్చట్లేదు. సోమవారం జరిగిన టాస్క్ లో వరుణ్ తన ర్యాంక్ ని వితికాకి ఇచ్చేస్తాడు. ఆ ర్యాంక్ ని ఇచ్చేయడం వల్ల అమె నామినేషన్ నుండి సేవ్ అవుతుందని అనుకున్నాడు. ఎందుకంటే వితికా నామినేషన్ లోకి వెళ్తే ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  


అది గుర్తించిన వరుణ్ ఆమెని కాపాడాలని అనుకున్నాడు. కానీ అనూహ్య పరిణామాల వల్ల హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు వరుణ్ ప్రవర్తన ప్రేక్షకుల్లో చర్చకి దారి తీసింది. అనవసరంగా అతనిపై ఉన్న అభిమానాన్ని తానే పోగొట్టుకున్నాడు. దీంతీ ఈ వారం ఎలిమినేషన్ లో అతను వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: