తెలుగైనా, తమిళ్ అయినా కూడా స్టార్ హీరోల సినిమాలు అంటే హిట్ అవుతాయి.. కథ ఎలా ఉన్న సరే ఆ సినిమాలు మాత్రం బాగానే వసూల్ కలెక్ట్ చేస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.. భారీ బడ్జెట్ తో మొన్న వచ్చిన ఆసినిమాలో దానికి ఉదాహరణ. ఇకపోతే సినిమాలు అంటే తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా విజయ్ పేరు వినపడుతుంది. ఆయన సినిమాలు ఎప్పుడు ఒక కొత్త కథను తలపించేలా ఉండి తమిళ తంబిల మనసును ఆకట్టుకుంటాయి. 


వివరాల్లోకి వెళితే ఈ హీరో పై ఓ నిర్మాత ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అదేంటంటే ప్రస్తుతం ఈ అమ్మడు నిర్మిస్తున్న సినిమా బిగిల్.. విజయ హీరో. అర్చన ఈ సినిమాకు నిర్మాత దాదాపు రూ.180 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చన.. విజయ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. విజయ్ సినిమా తిరుగుండదు. 


అయన సినిమా కాబట్టే నేను ఎంత పెట్టాను.. ఇంకా కూడా పెడతాను అంటూ ఆమె వెల్లడించింది. మిగితా హీరోలైతే నేను ఆలోచించేదాన్ని. ఈ హీరో సినిమాకు ఎలాగైనా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఆ హీరో కోసం నేను దేనికైనా రెడీ అంటుంది అర్చన..  స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాగా తెరకెక్కిన బిగిల్ సినిమాలో నయనతార ఇరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించారు.మొన్న రిలీజ్ అయినా ఈచిత్ర ట్రైలర్ కు వస్తున్నా రెస్పాన్స్ ఆ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. 



ట్రైలర్ పెట్టిన ఒక గంటకే దాదాపు 6 మిలియన్‌ వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్‌ అయిన ఈ ట్రైలర్‌ను రెండు గంటల 45 నిమిషాల్లోనే కోటి మందికి పైగా వీక్షించటం విశేషం. మరో విశమేంటంటే గంటలోనే పది లక్షల లైకులను కూడా సంపాదించింది.. కేవలం ట్రైలర్ కె ఎంత రెస్పాన్స్ వస్తే మరి సినిమా హిట్ అయినట్లే.. ఈ నెల 27 వ తేదీన ఈ సినిమా ప్రెకషకుల ముందు రానుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: