‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో అజయ్ దేవగన్ నటించే అతిధి పాత్ర కేవలం 15 నిముషాలు మాత్రమే ఉన్నా ఆ పాత్రకు అజయ్ దేవగన్ డిమాండ్ మేరకు రాజమౌళి 30 కోట్ల పారితోషికం ఇవ్వడానికి అంగీకరించాడు అని వస్తున్న వార్తలు విని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్య పోతోంది. అజయ్ దేవగన్ బాలీవుడ్ టాప్ హీరో కాదు కేవలం మిడిల్ రేంజ్ హీరో మాత్రమే. 

అలాంటి హీరోకు నిజంగానే రాజమౌళి అంత భారీ పారితోషికం ఇస్తున్నాడా ఇది అంతా ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగినట్లుగా చూపించి ఈ మూవీకి అత్యంత భారీ బిజినెస్ చేయడానికి రాజమౌళి అనుసరిస్తున్న వ్యూహాలు అనుకోవాలా అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరైతే ‘బాహుబలి’ శివగామి పాత్రకు అప్పట్లో శ్రీదేవి 4 కోట్ల పారితోషికం అడిగిందని షాక్ అయిన రాజమౌళి కేవలం 40 లక్షలతో రమ్యకృష్ణను శివగామి పాత్రకు ఎంపిక చేసిన రాజమౌళి ఆర్ధిక క్రమశిక్షణ ఇప్పుడు అతడికి తగ్గిపోయిందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.

రాజమౌళి మనస్థత్వాన్ని చాల దగ్గర నుండి చూసిన చాలామంది ఆర్ధిక విషయాలలో రాజమౌళి చాల గట్టిగా ఉంటాడు అని అంటూ ఉంటారు. రాజమౌళి టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిపోయి కోట్లాది రూపాయల పారితోషికాలు తీసుకుంటున్నా జక్కన్న ఇప్పటి వరకు ఏదైనా ఒక సామాజిక కార్యక్రమానికి కానీ కనీసం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కాని పెద్ద మనసుతో విరాళాలు ఇచ్చిన వార్తలు ఎప్పుడు బయటకు రాలేదు. 

దీనితో అలాంటి రాజమౌళి ఒక బాలీవుడ్ హీరో అతిధి పాత్ర చేస్తూ ఉంటే 30 కోట్ల పారితోషికం ఇచ్చాడు అంటే ఏమాత్రం నమ్మసక్యంగా లేదని టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోలు రాజమౌళి సినిమాలో నటించాలి అని ఓపెన్ గా చెప్పిన నేపధ్యంలో బాలీవుడ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ మార్కెట్ పెరగాలి అంటే సల్మాన్ ఖాన్ లాంటి టాప్ హీరోను వదిలి అజయ్ దేవగన్ లాంటి మిడిల్ రేంజ్ హీరోను రాజమౌళి ఎందుకు ఇష్టపడ్డాడు అంటూ ‘ఆర్ ఆర్ ఆర్’ బడ్జెట్ పై వస్తున్న వార్తలు సమాధానం లేని ప్రశ్నలుగా మారాయి అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: