సంక్రాంతి వస్తుంది అంటే పెద్ద సినిమాలు ముందే తేదీలను బుక్ చేసుకుంటాయి. అదే తరుణంలో ఈ సరి సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఒకటే తేదీకి విడుదలవుతున్నాయి అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది. రెండు సినిమాలతో అనుబంధం  వున్న నిర్మాత, బయ్యర్, ఎగ్జిబిటర్ దిల్ రాజు ఈ విషయంలో ఎందుకు ఏమీ చేయలేకపోయారు? ఇంతకీ అసలు విషయం ఏమిటి? అని పలు ప్రశ్నలు వస్తున్నాయి ఇండస్ట్రీలో.


నిజానికి ఈ విషయంలో సరిలేరునీకెవ్వరు చిత్ర యూనిట్ దే కాస్త తప్పు అని తెలుస్తుంది. ఎందుకంటే హారిక హాసిని సంస్థ తన సినిమా అలవైకుంఠపురంలో సినిమాను మహేష్ సినిమాకు ఒకరోజు వెనుకగా వేసుకోవాలని ముందుగానే అనుకోవడం జరిగింది. కానీ ఆ విషయమే తమకు కీలక బయ్యర్ అయిన దిల్ రాజుకు తెలియచేసింది. ఇక దిల్ రాజు కూడా మహేష్ బాబు సినిమాలో భాగస్వామి కనుక ముందుగా చెప్పినట్లు అవుతుందని అలా చేసారు.


కానీ... ఈ విషయాన్ని దిల్ రాజు మహేష్ దృష్టికి తీసుకరావడం జరిగింది. కానీ మహేష్ వేరే ప్రతిపాదనలతో వెనక్కు పంపించారు. తాము 11న వస్తామని, మూడురోజులు గ్యాప్ ఇచ్చి 14న అల వైకుంఠపురములో విడుదల చేసుకోవాలన్నది మహేష్ పంపిన ప్రతిపాదన, కానీ దీనికి మాత్రం  హారిక హాసిని సంస్థ అంగీకరించలేదు. ఎందుకంటే 14న వస్తే, ముందు కీలకమైన రెండురోజుల ఓపెనింగ్ పోతది అని సంస్థ వారి వాదన.


ఇదిఅంతా ఇలా ఉండగా  ఆయన సినిమా 11న అన్నపుడు బన్నీ సినిమా 11న అని అనలేదని, ఓ రోజు ఆలస్యంగానే వస్తామన్నారని ఇక సమస్య ఏమిటి అని కామెంట్లు బాగా  వినిపిస్తున్నాయి. మహేష్ చెప్పినట్లు లేదా అడిగినట్లు మూడురోజులు గ్యాప్ ఇచ్చేసివుంటే మంచిదా? ఇవ్వకపోతే కావాలని అదే డేట్ కు వేస్తారా? అని పలు ప్రశ్నలు బాగా  వినిపిస్తున్నాయి. హీరోలు బాగానే వుంటారని, నిర్మాతలు, బయ్యర్లకే సమస్య అని కామెంట్లు రావడం జరిగింది .


వెంకీమామ కూడా ఆంధ్రలోని 250 నుంచి 300 థియేటర్లలో విడుదలకు సిద్దం కాబోతున్నారు. నైజాంలో సురేష్ బాబుకు సమస్యలేదు. అలాగే సీడెడ్ కూడా ఫరవాలేదు. మొత్తంమీద సంక్రాంతికి నాలుగు సినిమాలు ప్రస్తుతానికి. ఇక అయిదో సినిమా కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా? సంగతి తెలియాల్సి వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: