హీరో రానా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను  సంపాదించుకున్నాడు . పవర్ఫుల్ పాత్రలకు ప్రాణం పోసే నటన రానా సొంతం . ఇక భిన్నమైన పాత్రలో నటిస్తూ రానా తన నట విశ్వరూపంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటు బాహుబలి లో బళ్ళాల దేవుడిగా సిక్స్ ప్యాక్ బాడీతో ఓ పవర్ ఫుల్ యాక్షన్ చూపించిన రానా... ఎన్టీఆర్ బయోపిక్ లో  చంద్రబాబు పాత్రలో... నిజమైన చంద్రబాబును మరిపింప చేసాడు  రానా. పాత్ర ఎలాంటిదైనా తన నట విశ్వరూపాన్ని చూపించగల సత్త రానాకు సొంతం . అయితే అటు సినిమాల్లో ఎంత ఆక్టివ్ గా ఉండటమే కాదు...  సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటాడు రానా. 

 

 

 

 

 

 అయితే గత కొద్దిరోజులుగా అటు సినిమాల్లో ఇది సోషల్ మీడియాలో ఎక్కడ రానా ఊసే లేదు. దీంతో రానా ఆరోగ్యం పై కొన్ని రోజులుగా కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రానా కి  ఆ  సమస్య వచ్చింది... ఈ సమస్య వచ్చింది అంటూ ఎవరికి వారు కొత్త కొత్త వార్తలతో హల్ చల్ చేసారు . అయితే మధ్యలో ఓసారి రానా తనకు ఏమీ కాలేదని చెప్పినప్పటికీ. ఆయన అనారోగ్యంగా ఉన్నారు అంటూ వస్తున్న వార్తలు మాత్రం తగ్గలేదు. రానా  చాలా రోజులనుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని ఆ సమస్య తీవ్రతరం కావడంతో  చికిత్స తీసుకుంటున్నారని... అందుకే ఎక్కడా కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడు యాక్టివ్ గా  ఉండే రానా సడన్ గా  కనిపించకుండా పోయే సరికి... ఈ వార్తలు నిజమని నమ్మారు అందరు. 

 

 

 

 

 అయితే తాజాగా దగ్గుబాటి రానా ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై సురేష్ బాబు  స్పందించారు. రానా  అనారోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని నిజానికి రానాకు  చిన్నప్పుడే కంటి సమస్య ఉండేదని.... అయితే చిన్న వయసులో కంటి చికిత్స చేస్తే రానా తట్టుకోలేడని ... పెద్దయిన తర్వాత చికిత్స చేసుకుంటే బాగుంటుందని డాక్టర్లు  సూచించారని తెలిపారు సురేష్ బాబు . అందుకే తాజాగా రానా కంటికి చికిత్స చేయించుకున్నారని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. చికిత్స ఈ మద్యే  పూర్తయిందని...  సర్జరీ జరిగిన తర్వాత రానా ఎక్కువ  టెన్షన్ పడడంతో కాస్త వీక్ అయ్యాడని సురేష్ బాబు చెప్పుకొచ్చారు. అంతే కానీ తన కొడుక్కి ఏం కాలేదని ఇంకొన్ని రోజుల్లో మళ్లీ మునుపటిలా తిరిగి వస్తాడని సురేష్ బాబు తెలిపారు. అయితే ఇన్నాళ్లు రానా అనారోగ్యం విషయంలో వార్తలు రావటం... రానా ఫ్యామిలీ కూడా  ఎవరు స్పందించక పోవడంతో టెన్షన్ లో ఉన్న అభిమానులు... రానా ఆరోగ్యం గురుంచి  సురేష్  బాబు క్లారిటీ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు.కాగా  ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: