సినిమా ప్రపంచం ఓ భూగోళం అయింది.. తన చుట్టూ తానె తిరిగినట్లు.. సినిమాలు కూడా మల్లె అదే కంటెంట్ తో వస్తున్నాయి. ఒక సినీ దర్శకుడు దైర్యం చేసి ఏదైనా ప్రయోగం చేస్తే ఈ సినిమా కనుక హిట్ అయితే మాత్రం.. ఇంకా మనవాళ్లకు లక్క బిందె దొరికినట్లే అంటున్నారు జనాలు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు హిట్ అయి ఉంటె వెంటనే సీక్వెల్ సినిమాలు షెడ్యూల్ చేస్తున్నారు. అలా చాలా సినిమాలు తెరకెక్కినాయి.. తెరకెక్కుతున్నాయి కూడాను.. 
ఇప్పటివరకు సీక్వెల్ లో వచ్చిన సినిమా విషయానికొస్తే.. చాలా సినిమాలే ఉన్నాయి.. అందులో ప్రముఖంగా వినపడే సినిమాలు ఇవే.. 


రాజుగారి గది :
టీవీ యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహించిన రాజుగారి గది సినిమా హిట్ అవ్వడంతో రెండు సీక్వెల్ సినిమాలు వచ్చాయి. తమ్ముడు అశ్విన్ బాబు ఈ సినిమాలన్నిటికీ హీరో. ఆ సినిమా ప్రస్తుతం మూడో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


భారతీయుడు :
లంచం తీసుకుంటే మరణం తప్పదు అని కమలహాసన్ చెప్పిన సినిమా భారతీయుడు.. ఈ సినిమా వచ్చి దాదాపుగా పదహారేళ్లు దాటింది. అప్పటిలో ఈ సినిమా బాబా హిట్ అవ్వడంతో ఇప్పుడు సీక్వెల్ గా భారతీయుడు 2 రాబోతుంది. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ హీరో. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. 


ఎఫ్ 2 :
వెంకటేష్, వరుణ్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ఎఫ్ 2 ఈ సినిమా మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఎఫ్ 3 సీక్వెల్ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు ఆ చిత్ర యూనిట్.. 


బంగార్రాజు :
సోగ్గాడే చిన్ని నాయన సినిమా హిట్ అయినా సంగతి తెలిసిందే.. ఆ సినిమాకు సీక్వెల్ గా మళ్ళీ నాగ్  హీరో గా బంగార్రాజు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. 
కార్తికేయ, కెజిఎఫ్, గూడాచారి 117 ఎలాంటి తెలుగు హిట్ సినిమాలన్నీ మళ్ళీ ఇప్పుడు సీక్వెల్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందు సినిమా అయితే హిట్ అయ్యాయి మరి ఈ సినిమా హిట్ అవుతాయో లేదో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: